NTV Telugu Site icon

Allu Arjun : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ

Whatsapp Image 2024 12 30 At 9.30.39 Am

Whatsapp Image 2024 12 30 At 9.30.39 Am

Allu Arjun : పుష్ప 2 బెనిఫిట్​ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్​దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో ఈ నెల 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్​ను అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అల్లు అర్జున్​ను చంచల్​గూడ జైలుకు తరలించారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్​ హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు ఈ నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Read Also:KTR Tweet: ఇది కక్ష్యా ? శిక్ష్యా? నిర్లక్ష్యమా ?.. కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్

సంధ్య థియేటర్ ఘటనలో నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. గతంలో అల్లు అర్జున్ కు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో బెయిల్ పిటిషన్ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదే కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత విచారణలో కౌంటర్ కి పోలీసులు సమయం కోరారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ తో బయట ఉన్న అల్లుఅర్జున్.. గతంలో 14 రోజుల రిమాండ్ ముగియడంతో అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ జనవరి 10 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Read Also:Sikandar : `సికింద‌ర్` లో గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ హంటింగ్!

Show comments