KTR Tweet: పదేళ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాల గౌరవం.. ఏడాదిలో ఎందుకు పడిపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా ? ఇది కక్ష్యా? ఇది శిక్ష్యా? ఇది నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు. మండలానికి ఒక్క గురుకుల పాఠశాలకు మాత్రమే పరిమితం చేసే కుట్ర దాగి ఉందా ? అని మండిపడ్డారు. అందుకే ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అభద్రతా భావం పెంచుతున్నారా ? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Tiger in Warangal: నర్సంపేటలో పులి సంచారం.. భయాందోళనలో ఏజెన్సీ ప్రజలు..
ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? అని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతిష్ఠాత్మకంగా సీఎం నుండి మంత్రుల వరకు కామన్ డైట్ అంటూ అట్టహాసంగా ప్రారంభించింది ఆరంభ శూరత్వమేనా ? అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శం.. నేడు అంతులేని నిర్లక్ష్యం అని తెలిపారు. విద్యార్థులు గురుకులాల నుండి పారిపోయే పరిస్థితికి కారణమెవ్వరు ? అని కేటీఆర్ ట్విట్ సంచలనంగా మారింది.
Top Headlines @9AM: టాప్ న్యూస్!