NTV Telugu Site icon

Nampally Court: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్..

Daggubati

Daggubati

హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేత‌పై నాంప‌ల్లి కోర్టులో శనివారం విచార‌ణ జ‌రిగింది. ఈ కూల్చివేత‌పై విచార‌ణ జ‌రిపిన అనంత‌రం సినీ న‌టులు వెంక‌టేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్‌ల‌పై కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించింది. సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్ లో ఉండగా.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు షాకిచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు .. ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్ పై శనివారం ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452,458,120 బీ సెక్షన్లపై కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ ప్రారంభించారు.

READ MORE: Australian Open: నేటి నుంచే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌.. చరిత్రకు టైటిల్ దూరంలో జొకోవిచ్‌!

అసలు ఏంటి ఈ కేసు?
గతంలో నంద కుమార్‌కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరింది. కాగా, 2022 నవంబరులో జీహెచ్ ఎంసీ సిబ్బంది.. బౌన్సర్లతో కలిసి హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయలేదు. 2024 జనవరిలో హోటల్‌ను దగ్గుబాటి కుటుంబం దౌర్జన్యంతో పూర్తిగా కూల్చి వేసింది.. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్లగా.. శనివారం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ లు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నంద కుమార్ ఏళ్లుగా పోరాడుతున్నారు. కాగా, శనివారం 11న నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు దగ్గుబాటి కుటుంబం పై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని .. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

READ MORE: Sabarimala Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. వారందరికి ఉచిత ప్రమాద బీమా

Show comments