Site icon NTV Telugu

Nama Nageshwar Rao : కేంద్రమంత్రికి బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు లేఖ

Nama Nageswara Rao

Nama Nageswara Rao

నేషనల్‌ డెంటల్‌ కమిషన్ బిల్లు 2020పై దంతవైద్యులకు సంబంధించిన దంత వృత్తిపరమైన సంస్థలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని, బిల్లును ముందుగా స్టాండింగ్ కమిటీకి పరిశీలన, చర్చ కోసం పంపాలని బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎంపీ నామా నాగేశ్వరరావు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్‌ మాండవీయాకు లేఖ రాశారు. బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపడం ద్వారా ప్రజలందరికీ సమాచారం అందించడంతో పాటు దంతవైద్యం తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటూ అభ్యంతరాల పరిశీలనకు బిల్లును స్టాండింగ్ కమిటీకి వెంటనే పంపాలని ఎంపీ నామా నాగేశ్వరరావు లేఖలో వైద్యారోగ్య శాఖ మంత్రిని కోరారు.

Also Read : Minister Botsa: వర్షాలకు హైదరాబాద్ పట్నమే మునిగిపోయింది.. నువ్వో లెక్కా….?

ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం.. నూనెగింజలు, ఆయిల్‌పాం విత్తనాల ఉత్పత్తి విషయంలో తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని, నిధుల విడుదలలో చిన్నచూపు చూస్తున్నదని లోక్‌సభలో నిన్న నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షను లోక్‌సభలో లిఖితపూర్వకంగా ప్రశ్నించారు నామా నాగేశ్వర రావు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఆయిల్‌ఫాం సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండగా, కేంద్రం మాత్రం నిధులు సక్రమంగా కేటాయించకుండా ఇబ్బంది పెడుతున్నదని ధ్వజమెత్తారు నామా. ఆయిల్‌ సీడ్స్‌, ఆయిల్‌పాం ప్రాయోజిత పథకాల నిధుల కేటాయింపునకు సంబంధించి కేంద్రం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నదని నామా విమర్శించారు. 2018 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి కేటాయించి, విడుదల చేసిన నిధుల్లో తీవ్ర వివక్ష చూపించారని పేరొన్నారు. 2022-23లో ఆయిల్‌సీడ్స్‌కు సంబంధించి పైసా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు నామా నాగేశ్వర రావు.
Also Read : CM Jagan: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష

Exit mobile version