Nallapareddy: దొంగ ఏడుపులు ఏడ్చినా.. దత్తపుత్రుడుతో కలిసినా.. సీఎం వైఎస్ జగన్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. సీఎం వైఎస్ జగన్ కు ప్రజల ఆశీర్వాదం ఉంది.. అన్ని పార్టీల ఆశీర్వాదం ఉందన్న ఆయన.. అన్ని వర్గాల వారు జగన్ ను ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణం షాది మంజిల్ వద్ద ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజమండ్రి జైల్లో ఒక దొంగ ఉన్నాడు.. ఆయన ఏసీబీ జడ్జికి ఒక లేఖ రాశాడు.. తన భద్రతకు ముప్పు ఉందని.. హత్య చేయటానికి కోట్లు చేతులు మారుతున్నాయని ఆరోపించారు.. అసలు చంద్రబాబును చంపాల్సిన అవసరం వైసీపీ నేతలు, కార్యకర్తలకు లేదన్నారు. ఇన్ని ఏళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేసి.. అరెస్టు కాకుండా.. జైలుకు వెళ్లకుండా తప్పించుకుని తిరిగాడు.. పాపం పండింది కాబట్టే చంద్రబాబు ఇప్పుడు స్కిల్ కేసులో దొరికాడన్నారు.
గోదావరి పుష్కరాల సమయంలో నిర్ధాక్షణంగా 29 మంది ప్రాణాలు చంద్రబాబు వల్లే పోయాయి.. హైదరాబాద్ లో రైతులు మీద కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు. ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించి మానసిక హత్యకు గురి చేశాడు అని మండిపడ్డారు నల్లపరెడ్డి.. స్కిల్ స్కాం లో రూ.370 కోట్లు చేతులు మారాయని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు ఇంట్లో ఆయన పీఏ శ్రీనివాసులు ఈ డబ్బు పెట్టాడు.. అన్ని కోణాల్లో విచారణ చేశారు. అందుకే ఎక్కడ దొరకాలో అక్కడే దొరికాడన్నారు. మనది ధనబలం.. వాళ్లది ప్రజాబలం అని భువనేశ్వరమ్మ అంటోంది.. ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రిగా దించేసి మానసిక హత్య చేసిన వాళ్లలో ఆయన పిల్లలు కూడా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమె భర్తని అరెస్టు చేసినందుకు భువనేశ్వరి చాలా బాధపడుతోందిజ. నిజం గెలవాలి నిజం చెప్పాలని మాట్లాడుతున్నావు.. ముందు మీ తండ్రికి క్షమాపణ చెప్పాలని సూచించారు ప్రసన్నకుమార్ రెడ్డి.. ఈ రోజు తెగ బాధపడుతూ వ్యాన్లు ఎక్కి కన్నీళ్లు పెడుతున్నారు.. మీరు చేసిన తప్పులు కూడా చెప్పండి.. ఎన్టీ రామారావు లో భగవంతుని చూసుకున్నాం.. కానీ, ఎన్టీఆర్‌కు ద్రోహం చేసినవారు ఈరోజు చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు.. బాలయ్య బాబు ఏం మాట్లాడతాడో అతనికే అర్థం కాదు.. తెలుగే రాదు అని ఎద్దేవా చేశారు. పప్పు సంగతి అందరికీ తెలుసు.. దొంగ ఏడుపులు ఏడ్చినా దత్తపుత్రుడుతో కలిసినా జగన్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.