Anaparthi: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.. ఆ సీటు మార్పుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో.. ఆ పార్టీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయబోతున్నారు.. మొదట భారతీయ జనతా పార్టీలో చేరి.. పోటీ చేయాల్సిందిగా నల్లమిల్లిని కోరారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కానీ, టీడీపీని వీడేందుకు ఆయన ఒప్పుకోలేదు.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నచ్చజెప్పడంతో.. రామకృష్ణారెడ్డి.. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Read Also: Suriya-Jyothika: 18 ఏళ్ల తర్వాత.. ఆఫ్‌స్క్రీన్, ఆన్‌స్క్రీన్ హిట్ జోడీ!
అయితే, అనపర్తి అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని భావించింది.. కానీ, కూటమి పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించిన ఆ సీటును తిరిగి టీడీపీకి కేటాయించేందుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోలేదు.. అనపర్తి సీటు కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. మరోవైపు.. బీజేపీలో చేరి ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించలేదు.. ఈ వ్యవహారంపై చర్చలు జరుగుతూ వచ్చినా.. కొలిక్కిరావడానికి సమయం పట్టింది. దీంతో.. అటు బీజేపీ, ఇటు టీడీపీలో అనపర్తి సీటుపై పెద్ద రగడే చోటు చేసుకుంది.. ఢిల్లీ బీజేపీ నేతలు సైతం జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చింది.. అనపర్తిలో తిరిగి టీడీపీయే పోటీ చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చినా.. బీజేపీ పెద్దలు అందుకు ఒప్పుకోలేదు. దీంతో.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి నచ్చజెప్పి ఉప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు.. దీంతో.. నల్లమిల్లి బీజేపీలో చేరి.. ఆ పార్టీ అభ్యర్థిగా అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు..