NALCO Recruitment 2024: జాతీయ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) లో ఉద్యోగం పొందాలనుకుంటున్న వారికి ఇది మంచి వార్త. నాల్‌కో నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల కోసం నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు నాల్‌కో అధికారిక వెబ్‌సైట్ nalcoindia.com ను సందర్శించి దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ పోస్టుల కోసం ఇప్పటివరకు దరఖాస్తు చేయనివారు డిసెంబర్ 31, 2024 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 518 పోస్టుల కోసం నియామక ప్రక్రియ జరుగుతుంది. నాల్‌కోలో ఉద్యోగం చేయాలనుకునే వారు ముందు నోటిఫికేషన్ వివరాలను జాగ్రత్తగా చదవండి.
Also Read: Corbin Bosch: డెబ్యూ మ్యాచ్‌లో మొదటి బంతికే వికెట్ తీసిన కొర్బిన్ బోష్..
ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* SUPT (JOT) – లేబొరేటరీ: 37 పోస్ట్‌లు
* SUPT (JOT) – ఆపరేటర్: 226 పోస్ట్‌లు
* SUPT (JOT) – ఫిట్టర్: 73 పోస్ట్‌లు
* SUPT (JOT) – ఎలక్ట్రికల్: 63 పోస్ట్‌లు
* SUPT (JOT) – ఇన్‌స్ట్రుమెంటేషన్: 48 పోస్ట్‌లు
* SUPT (JOT) జియాలజిస్ట్: 4 పోస్టులు
* SUPT (JOT) – HEMM ఆపరేటర్: 9 పోస్టులు
* SUPT (SOT) – మైనింగ్: 1 పోస్ట్
* SUPT (JOT) – మైనింగ్ మేట్: 15 పోస్ట్‌లు
* SUPT (JOT) – మోటార్ మెకానిక్: 22 పోస్టులు
* డ్రస్సర్-కమ్-ఫస్ట్ ఎయిడర్ (W2 గ్రేడ్): 5 పోస్ట్‌లు
* లేబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ III (PO): 2 పోస్టులు
* నర్స్ గ్రేడ్ III (PO గ్రేడ్): 7 పోస్ట్‌లు
* ఫార్మసిస్ట్ గ్రేడ్ III (PO గ్రేడ్): 6 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య- 518
ఇక ఈ ఉద్యోగాలకు వయో పరిమితి చూస్తే.. SUPT (JOT) పోస్టులకు గరిష్ట వయస్సు 27 ఏళ్లుగా, SUPT (SOT) మైనింగ్ పోస్ట్ కు గరిష్ట వయస్సు 28 ఏళ్లుగా, W2 గ్రేడ్ & PO గ్రేడ్ పోస్టులుకు గరిష్ట వయస్సు 35 ఏళ్లుగా నిర్ణయించారు అధికారులు. ఇక విద్య అర్హతల విషయానికి వస్తే.. ల్యాబొరేటరీ ఉద్యోగం కోసం రసాయన శాస్త్రంలో BSc (ఆనర్స్) డిగ్రీ ఉండాలి. ఆపరేటర్/ఫిట్టర్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం సంబంధిత ట్రేడ్‌లో 10వ తరగతి ఉత్తీర్ణత, ITI (2 సంవత్సరాలు) సర్టిఫికేట్ అవసరం. జియాలజిస్ట్ కోసం జియాలజీలో BSc (ఆనర్స్) డిగ్రీ ఉండాలి. HEMM ఆపరేటర్ కోసం 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ITI, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. డ్రెసర్-కమ్-ఫస్ట్ ఎయిడర్/ల్యాబ్ టెక్నీషియన్/నర్స్/ఫార్మాసిస్టుల కోసం సంబంధిత విభాగంలో డిప్లొమా, అవసరమైన సర్టిఫికేట్లు ఉండాలి.
Also Read: Income Tax: రూ. 15 లక్షల వరకు సంపాదిస్తున్న వారిపై ఆదాయపు పన్ను తగ్గింపు..!
ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అప్లై చేసుకొనేవారు జనరల్/OBC (NCL)/EWS అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. అదే SC/ST/PwBD/ఎక్స్-సర్వీస్‌మెన్/ఇంటర్నల్ అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలకు, నాల్‌కో అధికారిక వెబ్‌సైట్ nalcoindia.com ని సందర్శించండి. అప్లై చేసుకొనే అభ్యర్థులు https://mudira.nalcoindia.co.in/rec_portal/default.aspx కి వెళ్లి అక్కడ పూర్తి వివరాలను పూరించాలి.