సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ 1990 లో హిందీ చిత్రం భాగీ తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. నగ్మా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానించింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో నటించి అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఈ భామ హిందీ, తమిళం, కన్నడ, మలయాళ, భోజ్ పురి, మరాఠీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది.కొన్నాళ్ళ కు హీరోయిన్ గా రిటైర్ అయిన నగ్మా అత్త పాత్ర లో మెరిసింది . అల్లరి రాముడు మూవీలో ఎన్టీఆర్ అత్తగా ఎంతగానో అలరించింది.2002 తర్వాత నగ్మా తెలుగులో ఏ మూవీ చేయలేదు..పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నగ్మా 2004లో కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత 2008 నుండి పూర్తిగా నటనకు దూరమైంది.
2015 లో నగ్మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎంపిక అయ్యారు.ప్రస్తుతం నగ్మా వయస్సు 48 ఏళ్ళు అయినా ఈ భామ వివాహం చేసుకోలేదు. పెళ్లి చేసుకోకపోయిన కొందరు నటుల తో ప్రేమాయణం సాగించిందని అప్పట్లో హీరోయిన్ నగ్మా పై వరుసగా రూమర్స్ వచ్చాయి..అయితే తాజాగా సీనియర్ హీరోయిన్ నగ్మా ఆమె పెళ్లి పై స్పందించారు. వివాహం చేసుకోవాలనే కోరిక తనకు కూడా ఉందని ఆమె వెల్లడించారు. వివాహం చేసుకోకూడదు అనే నియమం నేను అస్సలు పెట్టుకోలేదు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి. మనకు ఒక తోడు, కుటుంబం కావాలని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది.. అయితే కాలం కలిసొస్తే నాకు పెళ్లి అవుతుందేమో చూడాలి.. పెళ్ళైతే కనుక నేను ఫుల్ హ్యాపీ గా వుంటాను. కానీ సంతోషం కొంత కాలానికే పరిమితం కాకూడదు కదా… అని ఆమె అన్నారు. ప్రస్తుతం నగ్మా తన పెళ్ళి పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.