Nagarjuna : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన “నా సామిరంగ” సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.ఈ సినిమాను కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించారు.ఈ సినిమా మలయాళం మూవీ రీమేక్ గా తెరకెక్కింది.ఈ సినిమాతో నాగార్జున కొరియోగ్రాఫర్ గా వున్న విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేశారు.ఈ సినిమాలో అల్లరి నరేష్ ,రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు.సంక్రాంతికి ‘నా సామిరంగ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగార్జున ప్రస్తుతం ‘కుబేర’సినిమాతో బిజీగా ఉన్నారు.
Read Also :Pushpa 2 : స్పెషల్ సాంగ్ లో నటించనున్న యానిమల్ బ్యూటీ.. క్రేజీ న్యూస్ వైరల్..?
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమాలో హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తుండగా నాగార్జున అతిథి పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా తరువాత నాగార్జున ఎవరి డైరెక్షన్ లో నటిస్తున్నారు అని నాగార్జున ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే నాగార్జున తన తరువాత సినిమాను కూడా విజయ్ బిన్నీతోనే చేయనున్నట్లు సమాచారం.అయితే ఇటీవలే విజయ్‌కి అడ్వాన్స్ కూడా ఇచ్చారని సమాచారం. అయితే ఈ సారి సొంత కథతోనే వీరిద్దరి కాంబోలో సినిమా రానున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది.