Pushpa 2 : స్పెషల్ సాంగ్ లో నటించనున్న యానిమల్ బ్యూటీ.. క్రేజీ న్యూస్ వైరల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2”..బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమాను మరింత భారీగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె వీడియో,పోస్టర్స్,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.’పుష్ప పుష్ప’ అంటూ సాగే ఈ సాంగ్ రికార్డు వ్యూస్ తో అదరగొడుతుంది.
Read Also :Game Changer : శంకర్ మార్క్ ఫిల్మ్ గా ‘గేమ్ చేంజర్’.. థమన్ కామెంట్స్ వైరల్..
Also Read
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేసారు.కపుల్ సాంగ్ గా రానున్న ఈ సాంగ్ ను “మే 29 ” ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.అయితే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉండనున్నట్లు సమాచారం.పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఊ అంటావా మావా అంటూ సమంత వేసిన స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే పుష్ప 2 సినిమాలో కూడా అదిరిపోయే ఐటెం సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే ఐటెం సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి.తాజాగా యానిమల్ బ్యూటీ ‘తృప్తి డిమ్రి ‘ పేరు వినిపిస్తుంది.యానిమల్ సినిమాతో స్టార్ గా మారిన ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి.తాజాగా ఈ భామకు ఈ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
ఎక్సైజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
-
Nara Rohith : త్రివిక్రమ్’పై ఆ ఒక్క కంప్లైంట్ ఉంది!
-
Ration Rice Scam : బ్రాండెడ్ బియ్యం ముసుగులో రేషన్ దందా.. హైదరాబాద్‌లో భారీ స్కామ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Janhvi Kapoor: ‘సౌత్‌లో స్క్రిప్ట్ ఉండదు.. కెమెరా ఎక్కడ పెడతారో తెలీదు’
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..