Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ పెద్ద ప్యామిలీలలో అక్కినేని కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుంచి మూడు తరాల హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. తొలితరం నటులు నాగేశ్వరరావు ఆ తర్వాత తరం ఆయన కొడుకు నాగార్జున ఇద్దరూ స్టార్ హీరోలుగా చెలామణి అయ్యాడు. ఇప్పటికీ నవ మన్మథుడిలా నాగార్జున కుర్ర హీరోయిన్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ మూడో తరం నటులైన నాగచైతన్య, అఖిల్ లు మాత్రం ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేకపోతున్నారు. అటో ఇటో నాగచైతన్య కాస్తో కూస్తో కొన్ని హిట్స్ సాధించి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. కానీ ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్లయినా చెప్పుకోదగ్గ హిట్ లేక హిట్ సినిమాకోసం అఖిల్ తాపత్రయపడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది హీరోలు పాన్ ఇండియా లెవల్లో హీరోలుగా రాణించి రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరుతున్నారు. అంత పెద్ద బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉండి కూడా నాగచైతన్య, అఖిల్ లు మాత్రం ఇప్పటికీ 100 కోట్ల క్లబ్ లోకి చేరలేకపోతున్నారు. అయితే ఈ విషయంలో నాగార్జున షేమ్ గా ఫీల్ అవుతున్నారట.
Read Also:Anti Dowry Act: బాబోయ్ ఇది నిజమా.. కట్నం తీసుకుంటే కటకటాలకేనా?
అంతే కాదు తన కొడుకులను ఎలాగైనా సక్సెస్ బాటలో నిలబెట్టాలని చాలా ప్రయత్నిస్తున్నారట. దానికి సంబంధించి ఒక వార్త సోషల్ వీడియోలో చక్కర్లు కొడుతుంది. నాగచైతన్య, అఖిల్ జాతకం అంతగా బాగాలేదట. వారి జాతాకాల్లో దోషాలున్నాయట. వారి జాతకంలో దోషం వల్లే వాళ్ల సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయట. ఇదే విషయం ప్రముఖ జ్యోతిష్యుడు నాగార్జునతో చెప్పాడట. అయితే వారి భవిష్యత్తు బాగుండాలంటే దోష పరిహార పూజలు చేయాలని, లేకపోతే మీ కొడుకులు సక్సెస్ కారు అని చెప్పడంతో భయంతో నాగార్జున ఎప్పుడు చేయని పని చేస్తున్నారట. అదేంటంటే ఇప్పటివరకు నాగార్జున పూజలు, యజ్ఞాలు,హోమాలు,పరిహార పూజలు వంటివి అస్సలు నమ్మరరు.కానీ ఫస్ట్ టైం కొడుకుల కోసం అలాంటి హోమాలు, పరిహార పూజలు చేయడానికి ఒప్పుకున్నారట.ఇక త్వరలోనే తన కొడుకుల కోసం దోష నివారణ పూజలు చేసి ఎలాగైనా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ గా తన కొడుకులను నిలబెట్టాలని చూస్తున్నారట. మరి నాగార్జున పూజా ఫలితం దక్కుతుందో లేదో.
Read Also:ARM: టీజర్ అదిరింది… పాన్ ఇండియా సినిమాలో బేబమ్మ