NTV Telugu Site icon

Naga Chaitanya Engagement: ఇట్స్ అఫీషియల్.. శోభితతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్! నాగార్జున ట్వీట్ వైరల్

Naga Chaitanya Engagement

Naga Chaitanya Engagement

Naga Chaitanya and Sobhita Dhulipala’s Engagement Pics Viral: టాలీవుడ్‌ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్లలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. గురువారం ఉదయం 9:42 నిమిషాలకు శోభిత-చైతన్యలు రింగ్స్ మార్చుకున్నారు. ఈ విషయాన్ని టాలీవుడ్ కింగ్, నాగచైతన్య తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. చై-శోభిత జంటకు నెటిజన్లు, టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘నా కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. శోభితను మా కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. కొత్త జంటకు నా అభినందనలు. వీరి జీవితం మొత్తం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా. దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’ అని కింగ్ నాగార్జున ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు చై-శోభిత ఎంగేజ్‌మెంట్ పోటోలను పంచుకున్నారు.

Also Read: Vijay-TVK Party: తిరుచ్చిలో‌ భారీ బహిరంగ సభ.. పార్టీ అజెండాను ప్రకటించనున్న విజయ్!

నాగచైతన్యకు గతంలో పెళ్లైన విషయం తెలిసిందే. కొన్నేళ్లు డేటింగ్ చేసిన చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ 2021లో విడిపోయారు. ఇక శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య చాలా కలం నుంచి స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరి పెళ్లంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తుండగా.. నేడు అధికారికంగా ప్రకటించారు. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌ అయిన శోభిత.. ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. నాగచైతన్య తండేల్‌తో బిజీగా ఉన్నారు.

Show comments