కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో ఆ పార్టీకి సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇంటికి బీఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ వెళ్లారు. అనంతరం నాగం జనార్ధన్ రెడ్డితో వారు సమావేశం అయ్యారు. నాగంను బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. ఒకటి రెండు రోజుల్లో కేసీఆర్ ను కలిసి బీఆర్ఎస్ లో చేరనున్నారు.
Rajnath Singh: రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించింది సిక్కులే.. వారి సహకారాన్ని మరిచిపోలేం..
ఈ సందర్భంగా నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ పరిస్థితుల్లో తాను పార్టీ మారుతున్ననో చెప్పానని అన్నారు. తనకు జరిగిన అవమానంతో కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్లు తెలిపారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకొని బీఆర్ఎస్ లో చేరుతానని నాగం చెప్పారు. త్వరలో సీఎం కేసిఆర్ ను కలుస్తానన్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజు తగ్గుతోందని తెలిపారు.
Kishan Reddy: బీసీలను అందరూ మోసం చేశారు.. అండగా నిలిచింది బీజేపీ మాత్రమే..
కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు చిరకాల మిత్రుడు నాగం జనార్ధన్ అని అన్నారు. పుట్టు తెలంగాణ వాది, రాష్ట్రం సిద్దించాలని కోరుకున్న వ్యక్తి నాగం జనార్ధన్ రెడ్డి అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరాలని కోరామని.. వారికి కాదు, పార్టీలో చేరిన ఆయన కార్యకర్తలకు పార్టీలో స్థానం ఉంటుందని అన్నారు. వారి అనుభవం స్థాయికి సముచిత స్థానం కలుగుతుందని పేర్కొన్నారు. అందరం సమిష్టిగా వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేస్తామని కేటీఆర్ అన్నారు.