Naga Chaitanya : నాగచైతన్య నెక్ట్స్ మూవీ బడ్జెట్ అంతనా.. నోరెళ్ల బెడుతున్న ఫ్యాన్స్
- ఫిబ్రవరి 7న విడుదల కానున్న తండేల్ సినిమా
- నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన నాగచైతన్య
- ఏకంగా రూ.110 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya : యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేత చిక్కి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
Read Also: IND vs AUS: ఐపీఎల్ వేలంలో ఏ టీంకు వెళ్తున్నావు..? మ్యాచ్ మధ్యలో నాథన్ లియాన్, పంత్ సంభాషణ
Also Read
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
ఆ సమయంలో తన ప్రియురాలు శ్రీకాకుళంలో ఉండడంతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి వారంతా పాకిస్తాన్ జైలు నుంచి ఎలా బయటకు వచ్చారు? లాంటి అంశాలను చాలా నేచురల్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ నెల 2024 లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ సినిమాలు క్యూ కట్టి ఉండడంతో ఈ సినిమాని ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.
Read Also:Mechanic Rocky Review: విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ రివ్యూ!
అయితే, ఈ సినిమా రిలీజ్‌కి ముందే నాగచైతన్య నెక్స్ట్ మూవీ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్‌లో నాగచైతన్య తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను సరికొత్త కథతో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందట. అయతే, ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.110 కోట్ల మేర కేటాయించనున్నారట మేకర్స్. ఇందులో రూ.30 కోట్లు కేవలం వీఎఫ్ఎక్స్‌కే వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అప్పుడే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రొరంభించేందుకు యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?