NTV Telugu Site icon

Nagababu: ఈ గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది

Naga Babu

Naga Babu

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయాన్ని సాధించింది. ఊహించని రీతిలో విక్టరీ దిశగా సాగిపోతుంది. ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భారీ విజయం నమోదు చేశారు. 70 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: KK Survey: కిక్కెకించిన ‘కేకే’ సర్వే.. కూటమి సునామీని బాగానే అంచనా వేసాడుగా..

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘సరికొత్త రాజకీయ మలుపుగా ఈ గెలుపు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ గెలుపు జనం గెలుపు. జనసేనాని గెలుపు. విజనరీ చంద్రబాబు గెలుపు. భరతమాత ముద్దు బిడ్డ గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గెలుపు. నాయకుడి పిలుపుతో మార్పు కోసం పాటుపడిన ప్రతి పౌరుడి గెలుపు. కూటమి విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి జనసైనికుడికి వీరమహిళకి నా ధన్యవాదాలు, శుభాబినందనలు.’’ తెలుపుతున్నట్లు నాగబాబు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Akira Nandan: పవన్ నివాసానికి భారీగా అభిమానులు.. దండం పెట్టి పంపిన అకీరా