ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పు చూపిస్తూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. దీంతో వైసీపీ, జనసేన నేతల మధ్య వివాదలు తలెత్తుతున్నాయి. అయితే.. ఈ క్రమంలోనే జనసేన నేతలు వైసీపీ మంత్రులపై దాడిచేసేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే.. ఈ విషయంపై జనసేన రాయకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు ట్విట్టర్ వేదిక స్పందించారు.
Also Read : Crackers Prices: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి.. కొండెక్కిన క్రాకర్స్
తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా ‘జనసేన ,,,,,,,,,, వైసీపీ నాయకుల మీద దాడిచేయటం…,,, .ఇంటెలిజెన్సు హెచ్చరిక…. సీక్రెట్ గ పంపిన సర్కులర్ మీడియా కి అందటం….. ఓహో ఇప్పుడు జనసేన మీద మరో సారి ఎటాక్ చెయ్యటానికి రంగం సిద్ధం..janasainiks జాగ్రత్త …………వైజాగ్ ఇన్సిడెంట్స్ లాంటివి చాలా ఉంటాయి… వైసీపీ ప్రభుత్వంకి ఒక సలహా. ఇలాంటి పనికిమాలిన పనులకి టైం వేస్ట్ చేయకండి .మీకు ఇంకా 1year 5మంత్స్ టైం వుంది.ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధి కి టైం వెచ్చించి కనీసం కొంత ఆయన మంచి గవర్నెన్స్ ని ఏపీకి అందించండి. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు.మీరు మీ ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉంటే మాత్రం గెలిచే అవకాశం కాదు కదా కనీసం గౌరవంగా ఓడిపోయే అవకాశం కూడా కోల్పోతారు .its my honest advice ………జైహింద్…జై janasena’ అంటూ పోస్ట్ చేశారు.