NTV Telugu Site icon

Nagababu : పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు

Nagababu Fires On Ap Minist

Nagababu Fires On Ap Minist

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు నటుడు, జనసేన నేత నాగబాబు. తాజాగా ఆయన కర్నూలులో మాట్లాడుతూ వైసీపీపై జనసేన నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఒక పార్టీయేనా.. అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ ఆయన మండిపడ్డారు. పొత్తులు ఎవరితో అనేది పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తారని ఆయన స్పష్టం చేశారు. పొత్తులు ఖరారు తరువాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయం జరుగుతుందని ఆయన వెల్లడించారు. వీరమహిళలు, జన సైనికులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానని ఆయన వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి జన సైనికులు బలంగా వున్నారన్న నాగబాబు.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇంఛార్జీలను నియమించాలన్నారు.

Also Read : Women Missing Case: మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

ఇదిలా ఉంటే.. నిన్న ఏపీ ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించడం లేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను పరిష్కరానికి గవర్నర్ కల్పించుకొని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడంలేదంటూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు.