NTV Telugu Site icon

Naga Shaurya: కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాగశౌర్య.. బడ్జెట్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే

Nagashurya

Nagashurya

Naga Shaurya: హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నారు నాగశౌర్య. తాజాగా తన కొత్త సినిమాను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రానికి అరుణాచలం దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. నాగశౌర్య కెరీర్లో ఇది 24వసినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్‌ మొదలు పెట్టనుంది. కాగా తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Read Also: Kamal ‘Indian2: విశ్వ నటుడికి విషెష్‎తో ఇండియన్ 2పోస్టర్ రిలీజ్.. స్టైల్ మామూలుగా లేదు

విశిష్ట అతిథుల సమక్షంలో నాగశౌర్య 24వ సినిమా ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడు వి.వి.వినాయక్.. ముహూర్తం షాట్‌‌కు క్లాప్‌ కొట్టారు. అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్‌కి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. న్యూరో హాస్పిటల్ సాంబశివారెడ్డి, జి.ఎస్.కె ఇన్‌ఫ్రా టెక్ సంతోష్ కుమార్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. నాగ శౌర్య కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా NS24 రూపొందబోతుంది. హేరిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఛలో సినిమా తర్వాత నాగశౌర్యకు సరైన హిట్ లేదు. ఇటీవలే ఈ యంగ్‌ హీరో ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 23న రిలీజై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్‌ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ప్రస్తుతం నాగశౌర్య కమర్షియల్‌ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు.

Show comments