Naga Chaitanya : మరోసారి తండ్రితో చైతూ స్క్రీన్ షేర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత బిజీ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తున్న చైతూ తాజాగా మరికొన్ని భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మరీ ముఖ్యంగా తన తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి మరోసారి వెండితెరను పంచుకోబోతున్నారనే వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
Also Read : TheyCallHimOG Part : పవర్ స్టార్ OG సీక్వెల్ ఓజస్ గంభీర – రాంపేజ్ బిగిన్స్
Also Read
- Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
గతంలో ‘మనం’, ‘బంగార్రాజు’ వంటి చిత్రాలతో అలరించిన తండ్రీకొడుకుల కాంబినేషన్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’ వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ కొత్త ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారట. అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిన ఈ దర్శకుడు మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే, నాగచైతన్య తన కెరీర్లో మైలురాయి లాంటి 25వ సినిమా (NC25) కోసం ‘బెదురులంక 2012’ ఫేమ్ దర్శకుడు క్లాక్స్‌తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్యూర్ లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. చైతూ ఇమేజ్‌కు తగ్గట్టుగా క్లాక్స్ ఒక వైవిధ్యమైన ప్రేమకథను సిద్ధం చేశారట. ప్రస్తుతం చైతన్య తన ప్రతిష్టాత్మక చిత్రం ‘వృషకర్మ’ షూటింగ్లో తలమునకలై ఉన్నారు. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతోంది. ఇటు ‘వృషకర్మ’తో పాటు అటు కళ్యాణ్ కృష్ణ మరియు క్లాక్స్ సినిమాలను లైన్లో పెట్టి చైతూ తన లైనప్‌ను సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నారు. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న చైతన్యకు ఈ కొత్త ప్రాజెక్టులు మరిన్ని విజయాలను అందిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
ట్రెండింగ్
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!