NTV Telugu Site icon

Orange Movie: పవన్ కల్యాణ్ కు రూ.కోటి ఇచ్చిన నాగబాబు.. ఎందుకంటే ?

New Project (2)

New Project (2)

Orange Movie: ప్రస్తుతం రామచరణ్ గ్లోబల్ హీరోగా మారారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే భారీ హిట్లతో మెగా పవర్ స్టార్ అనిపించుకున్నారు. RRR తర్వాత ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. రాబోయే చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవల్లోనే రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన పుట్టినరోజు అయిన మార్చి 27న గతంలో ఆయన నటించి ఆశించిన ఫలితాన్ని అందుకోలేనపోయిన చిత్రం ఆరెంజ్ ను రీ రిలీజ్ చేశారు.

Read Also:PBKS vs RR: పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు

ఆరెంజ్ సినిమా మొదట 26 నవంబర్ 2010న విడుదలైంది. ఈ చిత్రానికి బొమ్మిరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఒకరిని మాత్రమే జీవితాంతం ప్రేమించలేం.. మొదట్లో ఉన్న ప్రేమ చివరి వరకు ఉండదు.. అందుకే జీవితాంతం ప్రేమను పంచుకోవాలనే కొత్త స్టోరీలైన్ తో రూపొందింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బబ్లీ గర్ల్ జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా రామ్ చరణ్ అభిమానులకు మాత్రం ఈ సినిమా చాలా ప్రత్యేకం. అందుకే ఆరెంజ్ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు. దీంతో సినిమా విడుదలైంది. మార్చి చివరి వారంలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది.

Read Also:Vijayasai Reddy: రూ.2 వేల నోట్ల రద్దును స్వాగతిస్తున్నాం

అప్పుడు చూడలేదు కానీ రీ రిలీజ్ టైంలో ఈ సినిమాను మరోసారి థియేటర్‌లో చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. రూ. ఈ క్రమంలో 1.05 కోట్లు వచ్చాయి. అయితే ఈ సినిమా రీ-రిలీజ్ ద్వారా వచ్చిన డబ్బును మెగా బ్రదర్, ఆరెంజ్ సినిమా నిర్మాత నాగబాబు ఈ డబ్బును జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చెక్కు రూపంలో అందజేశారు. ఈ విషయాన్ని జనసేన అధినేత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే రెండోసారి ఆరెంజ్ చిత్రాన్ని విడుదల చేసి ప్రదర్శించడంలో కీలక పాత్ర పోషించిన సాయి రాజేష్, ధర్మేంద్ర, ఎస్కేఎన్, శివచెర్రి, శ్రీనాథ్, ఉమా నాగేంద్ర, శ్రీధర్ తదితరులను నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు.