నేడు గుంటూరులో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపు పనులకు నిధులు మంజూరు చేయాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో 11వ రోజు రిలే నిరాహార దీక్షలు, రైతులకు జనసేన నాయకులు మనోహర్, తదితరులు మద్దతు పలకనున్నారు. ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లారు. పవన్ ఏపీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత వారాహి యాత్ర ముగిసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో రెండో విడత యాత్రపై దృష్టి సారించిన జనసేనాని పార్టీ ముఖ్యనేతలతో ఇవాళ సమావేశం నిర్వహించారు. అయితే రేపు ఏలూరు నుంచి రెండో విడత వారాహి యాత్ర ప్రారంభంకానుంది. ఈ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్, సభల వివరాలపై చర్చిస్తున్నారు.
Also Read : No Leave in 74 Years: సూపర్ వుమెన్.. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా 74 ఏళ్ల పాటు డ్యూటీ!
అయితే.. ఏలూరు లో రేపు సాయంత్రం భారీ సభ నిర్వహించి..యాత్ర మొదలుపెట్టబోతున్నారు. గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చించి రెండో విడుత యాత్ర ఖరారు చేశారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్ చర్చించారు. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు జనసేన నేతలు తెలిపారు.
Also Read : Janhvi Kapoor : ‘అమ్మ నన్ను పట్టుకుంది, ఏడుస్తోంది కానీ..’, జాన్వీ నోటివెంట శ్రీదేవి చివరి మాటలు