NTV Telugu Site icon

Nadendla Manohar: కూకట్ పల్లిలో ప్రేమ్ కుమార్ ను గెలిపించాలి..

Nadendla

Nadendla

Janasena MLA Candidate: కూకట్ పల్లి నియోజకవర్గం జనసిన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కృషి చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రేమ్ కుమార్ భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ శాసనసభకు పంపించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ విజ్ఞప్తి చేశారు. అయితే, 26వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి పవన్ కళ్యాణ్ కూకట్ పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు అని ఆయన తెలిపారు.

Read Also: CM KCR: ఇవాళ నాలుగు సభల్లో పాల్గొనున్న కేసీఆర్

ఇక, తాజాగా కూకట్‌పల్లిలో జనసేన ఐటీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్తులో భాగంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సీట్ల కోసం గట్టిగా ప్రయత్నించాం.. కానీ అనుకోని కారణాల వల్ల శేరిలింగంపల్లి వదులుకోవాల్సి వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరం కలిసి కృషి చేస్తేనే హైదరాబాద్ నగరం, మహా నగరంగా మారింది.. ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి పని చేసి సంపాదించుకున్నది ఇక్కడే పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో పాలు పంచుకున్నారని ఆయన తెలిపారు. వైసీపీ, టీడీపీలు పోటీ నుంచి విరమించుకోవటంతో, ఇక్కడి వారి తరపున నిలబడేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు జనసేన ఇక్కడ పోటీ చేస్తుందని నాదేండ్ల మనోహర్ అన్నారు.

Read Also: Molestation In Metro: బెంగళూరు మెట్రోలో యువతిపై లైగింక వేధింపులు.. గోర్లతో రక్కిన రాక్షసుడు

కూకట్‌పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ను గెలిపించి రెండు రాష్ట్రాలకు ఓ సందేశం ఇవ్వాలని నాదేండ్ల మనోహర్ అన్నారు. ఈ నెల 26వ తేదీన పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పబ్లిక్ మీటింగ్ జరగనుందన్నారు. ఈ సభకు అమిత్ షాతో కలిసి పవన్ కళ్యాణ్ మరోక మీటింగ్ కు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. 2019 ఎన్నికల తరువాత జగన్ దాష్టిక పరిపాలన చూసి అమరావతి రైతుల కోసం ఢిల్లీకి వెళ్ళాం.. రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని నాదేండ్ల మనోహర్ అన్నారు. కూకట్‌పల్లిలో గాజు గ్లాసు గుర్తును జనంలోకి తీసుకొని వెళ్ళాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.