NTV Telugu Site icon

Nadendla Manohar: రుషికొండలో రాజమహల్ నిర్మించుకుంటూ క్లాస్ వార్ అంటారా?

Nadendla Manohar

Nadendla Manohar

రుషికొండలో రాజమహల్ నిర్మించుకొంటూ క్లాస్ వార్ అంటారా?.. అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పేదవాడికి సెంటు భూమే.. ముఖ్యమంత్రి నివాసానికి 9 ఎకరాలు.. రూ.451 కోట్లు ఖర్చు చేస్తారా?.. సీఎం పచ్చదనం చూసేందుకు ప్రహరీ నిర్మించి గడ్డి పెంచడానికి.. రూ 21 కోట్లు నిధులా? అని ఆయన ప్రశ్నించారు. పేదల ఇళ్ల కాలనీల్లో కనీస సదుపాయాలు.. మౌలిక వసతులు లేవు.. ఇప్పుడు చెప్పండి ఎవరు పెత్తందారు?.. ప్రపంచంలో ఏ ప్రభుత్వ అధినేతా ఈ విధంగా వ్యవహరించలేదు?.. ఒబెరాయ్ గ్రూపు గండికోటలో ఏడు నక్షత్రాల హోటల్ నిర్మించడానికి రూ. 350 కోట్లు ఖర్చు అంటూ డీపీఆర్ ఇస్తే.. సీఎం క్యాంపు ఆఫీస్ కు మాత్రం రూ. 451.67 కోట్ల ఖర్చు చేశారు అని నాదేండ్ల మనోహార్ అన్నారు.

Read Also: Devara : దేవర షూటింగ్ లో హీరో శ్రీకాంత్ కు గాయం.. అస్సలు ఏమైందంటే..?

ప్రజాధనంతో భవంతి నిర్మించుకున్న సీఎంకి పేదలు, పెత్తందార్లు అంటూ మాట్లాడే అర్హతే లేదని నాదేండ్ల మనోహర్ చెప్పారు. విశాఖపట్నంలో రుషికొండపై రూ. 108.30 కోట్ల అంచనాతో టూరిజం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని పర్యాటక శాఖ చెప్పింది.. కోర్టులు, బ్యాంకులను తప్పుదోవ పట్టించి గుట్టుచప్పుడు కాకుండా రూ. 451.67 కోట్లు సీఎం కార్యాలయానికి వెచ్చించారు.. మత్స్యకారులు కూడా వెళ్లొదంటూ ఆదేశాలు జారీ చేశారు.. రుషికొండపై టూరిజం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని రూ. 140 కోట్లు బ్యాంకుల నుంచి రుణం తెచ్చారు.. 750 ఎగ్జిక్యూటివ్ ఛైర్స్, 100 సోఫా సెట్లు కొనుగోలు చేశారు అంటూ నాదేండ్ల మనోహర్ విమర్శించారు.

Read Also: Fire Accident: లక్నోలోని కెనరా బ్యాంక్‌లో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో 50 మంది..!

నిజంగా ఈ ప్రాంతంలో రిసార్టులే నిర్మిస్తే 20 పడకలతో గదులు ఏ మూలకు సరిపోతాయి? అని జనసేన పీఏసీ ఛైర్మెన్ నాదేండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి సీఎం క్యాంపు కార్యాలయం కోసం కొన్న ఫర్నేచరే.. ఇదంతా బయటకు తెలుస్తున్నా ఇంకా బ్యాంకులను మోసం చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.. రెండు రోజుల క్రితం కూడా సంబంధిత మంత్రి టూరిజం ప్రాజెక్టని మాట్లాడారని ఆయన మండిపడ్డారు. జరుగుతున్న పనులు కొనుగోలు చేస్తున్న ఫర్నిచర్ చూస్తుంటే మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి.. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ కూడా రిషికొండపై నిర్మిస్తుంది సీఎం క్యాంపు కార్యాలయం అని దమ్ము, ధైర్యంతో చెప్పలేకపోతున్నారు. రుషికొండ నిర్మాణాలపై నాలుగేళ్ల నుంచి రచ్చ నడుస్తోంది.. పర్యావరణానికి తీవ్ర విధ్వంసం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయని నాదేండ్ల మనోహర్ విమర్శలు చేశారు.

Read Also: Nani: అరే.. ఇదేం ప్రమోషన్స్ కాకా.. కేసీఆర్ నే ఇమిటేట్ చేస్తావ్ లే..

మా జనసేన నాయకులు అక్కడి పర్యావరణ విధ్వంసంపై న్యాయస్థానాల్లో పిటీషన్లు వేశారు అని నాదేండ్ల మనోహర్ అన్నారు. కొంతమంది జనసేన నాయకులపై కేసులు కూడా నమోదయ్యాయి.. విశాఖ పర్యటనలో ఉండగా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండుసార్లు రుషికొండపై నిర్మాణాలను పరిశీలిద్దామని వెళ్తే వేలాది మంది పోలీసులతో అడ్డుకున్నారు.. రహదారులపై బారికేడ్లు పెట్టి నిర్భందించారు.. నిజానికి అక్కడ కడుతున్నది టూరిజం ప్రాజెక్టు అయితే ఇన్ని నిబంధనలు ఎందుకు?.. చివరకు మత్స్యకార సోదరులు కూడా అటువైపు పోకూడదనీ, జీపీఎస్ పెట్టుకోవాలని నిబంధనలు పెట్టారు.. జగన్ బాగోతాలు ఒక్కొటీగా బయటకు వస్తున్నాయని నాదేండ్ల మనోహర్ వెల్లడించారు.