Devara : దేవర షూటింగ్ లో హీరో శ్రీకాంత్ కు గాయం.. అస్సలు ఏమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఫ్యామిలీ హీరో గా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు..ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసి ఎంతగానో మెప్పించారు హీరో శ్రీకాంత్..తనదైన టాలెంట్ తో హీరోగా, విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపై ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడు శ్రీకాంత్ విలన్ పాత్రలు అలాగే కీలకమైన రోల్స్ ల్లో నటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.శ్రీకాంత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ‘సరైనోడు’, ‘అఖండ’, ‘వారసుడు’, ‘హంట్’ మరియు ‘స్కంద’ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల గ్యాప్ లో ‘కోటబొమ్మాళి పీఎస్’ చిత్రాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను కూడా జోరుగా నిర్వహిస్తున్నారు.తాజాగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు శ్రీకాంత్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రీసెంట్ ఎపిసోడ్ లో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాలికి బ్లాక్ పట్టి కట్టుకొని కనిపించారు. వెంటనే నాగ్ ఏమైందని అడిగారు. దీంతో ‘దేవర’ మూవీ సెట్స్ లో గాయపడ్డట్టు ఆయన తెలిపారు.దేవర సినిమా ప్రస్తుత షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ క్రమంలో సెట్ లోని కంకరపై పరిగెడుతున్న సందర్భంగా గాయమైందని తెలిపారు..డాక్టర్ కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ట్రీట్ మెంట్ తర్వాత కూడా షూటింగ్ కు , ప్రమోషన్స్ కు హాజరైనట్టు ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. శ్రీకాంత్ వర్క్ డెడికేషన్ కు నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు..మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు..
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
తాజావార్తలు
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్‌తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్‌లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!