Site icon NTV Telugu

 Nacharam: వివాహేతర సంబంధం.. అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య..!

Murder

Murder

Nacharam: నాచారం‌లో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను రాడ్డుతో కొట్టి హత్య చేసింది భార్య. ఆమెకు ఓ వివాహేతరుడు సహకరించాడు. ఈ ఘటన నాచారం మల్లాపూర్ ప్రాంతంలో కలకలం రేపింది. ఒడిశాకు చెందిన నారాయణ్ బెహరా, అతని భార్య బంధిత బెహరా కొన్నేళ్లుగా నాచారం మల్లాపూర్‌లో కిరాయికి నివాసం ఉంటున్నారు. నారాయణ్ బెహరా ప్లంబర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య బంధిత ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది. అదే ఇంట్లో కిరాయికి ఉంటున్న విద్యాసాగర్‌తో బంధితకు గత నాలుగు నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

READ MORE: Moonglet Recipe: ప్రోటీన్ రిచ్ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. గ్రీన్ చట్నీతో టేస్టీ మూంగలెట్ తయారీ మీకోసం..!

ఈ వివాహేతర సంబంధానికి భర్త నారాయణ్ అడ్డు వస్తున్నాడని భావించిన బంధిత, తన ప్రియుడు విద్యాసాగర్‌తో కలిసి భర్తను రాడ్డుతో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఘటన అనంతరం మృతుడి బంధువులు నాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు బంధితను విచారించగా ఆమె నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. మర్డర్ జరిగిన 24 గంటల లోపే నిందితులైన బంధిత బెహరా, విద్యాసాగర్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

READ MORE: Medchal Malkajgiri: మూగజీవాల నుంచి రహస్యంగా రక్తం సేకరిస్తున్న ముఠా గుట్టురట్టు.. దాన్ని ఏం చేస్తారంటే?

Exit mobile version