Nacharam: నాచారంలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను రాడ్డుతో కొట్టి హత్య చేసింది భార్య. ఆమెకు ఓ వివాహేతరుడు సహకరించాడు. ఈ ఘటన నాచారం మల్లాపూర్ ప్రాంతంలో కలకలం రేపింది. ఒడిశాకు చెందిన నారాయణ్ బెహరా, అతని భార్య బంధిత బెహరా కొన్నేళ్లుగా నాచారం మల్లాపూర్‌లో కిరాయికి నివాసం ఉంటున్నారు. నారాయణ్ బెహరా ప్లంబర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య బంధిత ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది.…