Site icon NTV Telugu

Nabha Natesh: మూడేళ్లయితే అయింది.. భలే పాన్ ఇండియా ప్రాజెక్టు పట్టిందే..!

Whatsapp Image 2024 04 04 At 2.12.56 Pm

Whatsapp Image 2024 04 04 At 2.12.56 Pm

న‌భాన‌టేష్.. ఈవిడ టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌ పై దర్శనమిచ్చి మూడేళ్లు దాటిపోయింది. అయితే ఎట్ట‌కేల‌కు టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఓ గోల్డెన్‌ ఛాన్స్ ద‌క్కింది. నిఖిల్ హీరోగా చేస్తున్న ‘స్వ‌యంభూ’ పేరుతో ఓ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో న‌భాన‌టేష్ సెకండ్ హీరోయిన్‌ గా చేస్తోంది. న‌భాన‌టేష్ చివ‌ర‌గా టాలీవుడ్లో 2021లో రిలీజైన నితిన్ ‘మాస్ట్రో’ లో క‌నిపించింది. ఆ త‌ర్వాత టాలీవుడ్‌ కు బాగా గ్యాప్ ఇచ్చింది. ఓ ప్ర‌మాదంలో తాను తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు, ఆ సంఘ‌ట‌న వ‌ల్లే తాను రెండేళ్ల పాటు సినిమాల‌కు దూర‌మైన‌ట్లు తెలిపింది.

Also Read: RCB Title: అందుకే ఆర్‌సీబీ ఇంకా టైటిల్ గెలవలేదు: అంబటి రాయుడు

తనకి జరిగిన ప్ర‌మాదంలో తాను తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు, దాంతో తాను రెండేళ్ల పాటు సినిమాల‌కు దూర‌మైన‌ట్లు న‌భాన‌టేష్ తెలిపింది. ‘న‌న్ను దోచుకుందువ‌టే’ సినిమాతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో బ్లాక్‌ బ‌స్ట‌ర్ స‌క్సెస్ ను అందుకున్న‌ది. అయితే ఆ తర్వాత నటించిన డిస్కో రాజా, సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, అల్లుడు అదుర్స్ లాంటి సినిమాల్లో హీరోయిన్‌ గా న‌టించింది. కాకపోతే., ఈ సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ గా నిలిచాయి.

Also Read: OTT Trending Movies: ఓటీటీలో అదరగొడుతున్న 5 సినిమాలు ఇవే..

ఇకపోతే ఈరోజు ఒక పెద్ద అప్‌డేట్‌ తో వచ్చారు. చేతికి గాయమైన నభా నటేష్ మళ్లీ పనిలోకి వచ్చింది. ఈ మాస్టర్‌ పీస్‌ లో ఒక మహిళా ప్రధాన పాత్రను పోషించడానికి ఆమె వచ్చిందని.. దాంతో మేకర్స్ సినిమాలోని ఆమె రూపాన్ని వెల్లడించారు. నభా గాయం నుంచి కోలుకుని షూటింగ్ లో చేరినట్లు వీడియోలో చూపబడింది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌ లో, చీరలో నగలతో ఆమె ఖచ్చితంగా యువరాణిలా కనిపిస్తోంది. నిఖిల్ కూడా ఈ వీడియోలో ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోతున్నాడు.

Exit mobile version