Naa Saami Ranga : నా సామి రంగా పాటల సందడి మొదలైందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ చిత్రం నా సామి రంగ. ఈ సినిమాను విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలయిన నా సామి రంగ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట బాగా వైరల్ అయింది..సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది.ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం నా సామి రంగ మ్యూజిక్ సిట్టింగ్స్ కొనసాగుతున్నాయి. నాటు నాటు సాంగ్‌తో గ్లోబల్ వైడ్ గా పాపులరిటి సాధించి ఆస్కార్స్ విన్నర్స్‌గా నిలిచిన మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ ఈ సినిమా కోసం మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు. ఈ ఇద్దరి కాంబోలో ఓ పాట రెడీ అవుతుందని సమాచారం.
నాగార్జున, కీరవాణితో కలిసి దిగిన ఫొటోను చంద్రబోస్ షేర్ చేయగా.. నెట్టింట ఆ పిక్ వైరల్ అవుతోంది. సెన్సేషనల్ ఆల్బమ్ గ్యారంటీ.. అంటూ ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు.ఈ సినిమాలో నాగార్జునను ఇప్పటివరకు చూడని విధంగా మాస్ అవతార్‌లో సరికొత్తగా చూపించబోతున్నట్టు ఫస్ట్ లుక్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. గతంలో సంక్రాంతి బరిలో నిలిచిన బంగార్రాజు సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఇదే సీజన్‌లో వస్తుండటంతో సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్‌తో నా సామి రంగ షూటింగ్ షురూ అయిందని వరుస అప్‌డేట్స్ వచ్చేశాయి. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి అదిరిపోయే ఆల్బమ్ అందించనున్నారు… పవన్ కుమార్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని నా సామి రంగ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు..మరీ ఈ సంక్రాంతికి నాగార్జున మరో హిట్ అందుకుంటారో లేదో చూడాలి..
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!