Site icon NTV Telugu

Mythri Movie Makers: భారీగా సినిమాలను ట్రాక్ లో పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్..!

17

17

ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ జోరు మీదుంది. భారీ బడ్జెట్‌ తో ఏకంగా 6 భారీ సినిమాలను ఒకదాని తర్వాత ఒకటిగా నిర్మిస్తోంది. వై రవి శంకర్, నవీన్ యెర్నేని యాజమాన్యంలోని ఈ మేకర్స్ ప్రస్తుతం అనేక సినిమాలను సెట్స్ కింద పెట్టాయి . ఇక ఇందుకు సంబంధించి విషయాలు చూస్తే..

Also read: Happy Days Re release : మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న హ్యాపీ డేస్.. ఎప్పుడంటే?

పుష్ప – 2: రూల్’.. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా., సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న ప్రజల ముందుకు థియేటర్స్ కు రానుంది. ఇక RC17 గా రామ్ చరణ్ 17వ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాను కూడా సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ ల కాంబోలో తెరకెక్కుతున్న ఒక ప్రాజెక్ట్ మూడేళ్లుగా పెండింగ్‌ లో ఉంది. ఇది కూడా 2026లో టేకాఫ్ ప్రేక్షకుల ముందుకు రావచ్చు. అలాగే ‘సీతా రామం’ దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్ కోసం ఒక కథను రెడీ చేసాడు. ఈ ప్రాజెక్ట్ 2025 చివరిలో షూటింగ్ ప్రారంభించవచ్చు.

Also read: Save The Tigers 2: సీజన్ 1 కు మించి సీజన్ 2.. ఓటీటీలో దూసుకుపోతున్న ‘సేవ్ ది టైగర్స్ 2’..!

వీటితోపాటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ చిత్రం కూడా 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే తమిళ నటుడు అజిత్ కుమార్‌ తో కలిసి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఇటీవల ప్రకటించారు. దీని బడ్జెట్ 150 కోట్ల రూపాయలు. మరోవైపు చిత్రనిర్మాత గోపీచంద్ మలినేని, నటుడు సన్నీడియోల్ కాంబినేషన్‌ లో ఓ బాలీవుడ్ చిత్రం త్వరలో ప్రకటించబడుతుంది. ఇవ్వన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కాగా మరో మీడియం రేంజ్ సినిమాలను కూడా తెరకు ఎక్కిస్తుంది మైత్రీ మూవీ మేకర్స్. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే..

‘రాబిన్‌హుడ్’ నితిన్ కథానాయకుడిగా నటించిన సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల కానుంది. అలాగే ‘8 వసంతాలు’ అనే టైటిల్ తో దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో ఓ సినిమాను లైన్ పెట్టింది. మరోవైపు మలయాళంలో కూడా ‘నడికర్ తిలకం’ అనే మలయాళ ప్రాజెక్ట్ ను నటుడు టోవినో థామస్‌ తో ప్లాన్ చేసింది.

Exit mobile version