NTV Telugu Site icon

Mynampally Hanumantha Rao: మైనంపల్లి ప్రాణత్యాగానికైనా సిద్ధం.. మీరు రెడీనా?

Mynampally Hanumantha Rao

Mynampally Hanumantha Rao

Mynampally Hanumantha Rao: మల్లన్నసాగర్ వర్సెస్ మూసీగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూసీపై బీఆర్‌ఎస్, మల్లన్నసాగర్ పై కాంగ్రెస్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. గజ్వేల్‌లో మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీఆర్‌ఎస్ సరైన నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. తామెక్కడ మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఖాళీ చేయించలేదని.. మీలాగా బాధితులపై లాఠీలతో కొట్టించలేదని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మల్లన్నసాగర్ బాధితుల సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను పరామర్శించిన అనంతరం మైనంపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లేందుకు కొన్ని గ్రామాలను ఖాళీ చేయించారని.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. హైదరాబాద్‌లో వర్షాలు వస్తే సగం మునుగుతుందని.. మూసీ ప్రక్షాళన చేస్తే కావాలని ప్రజలను రెచ్చగొడుతున్నారని మైనంపల్లి వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను పట్టించుకోలేదన్నారు. హరీష్ రావుకు ఏడుపు వచ్చిందో లేదో.. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. తానూ పది కోట్ల రూపాయలు సేకరిస్తామన్నారు.

Read Also: Cyber Fraudsters: రెచ్చిపోతున్న కేటుగాళ్లు.. కలెక్టర్‌ ఫొటో డీపీగా పెట్టి ఎమ్మార్వోలతో చాటింగ్..

తెలంగాణ ఉద్యమంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారని.. ఎందరినో రెచ్చగొట్టి ప్రాణాలు తీశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్కరి ప్రాణం పోయినా హరీష్ రావు, కేటీఆర్దే బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు. పేదలను, బ్యాంకు లోన్లు తీసుకున్న వారిని ఆదుకుంటామన్నారు. బీఆర్ఎస్‌ హయాంలో అడ్డగోలు అనుమతులు ఇచ్చారని మైనంపల్లి తెలిపారు. కేటీఆర్‌ తన ఆస్తి మొత్తాన్ని బాధితులకు ఇస్తే.. తన ఆస్తితో పాటు తన భార్య ఆస్తిని కూడా ఇస్తానంటూ సవాల్ చేశారు. కేటీఆర్, హరీష్ రావులు వాళ్ళ ఆస్తి పంచి ఇస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు. మల్లన్నసాగర్ రైతులపై లాఠీచార్జి చేయలేదంటే తాను రాజకీయం వదిలేస్తానన్నారు. కేటీఆర్‌ను ఫస్ట్ జైల్లో వేసిన తర్వాత అధికారులను వేయాలన్నారు.

మల్కాజిగిరి నాలా మీద 400 ఇండ్లు ఉన్నాయని.. వాళ్లకు కొంత డబ్బులిచ్చి ఖాళీ చేయిద్దామంటే డబ్బులు ఎక్కడ నుంచి ఎత్తుకు రావాలని కేటీఆర్ ఎగతాళి చేశారన్నారు. మల్కాజిగిరిలో ఒక ఇల్లుకు సొంత డబ్బులు ఇచ్చి ఖాళీ చేయించామన్నారు. మల్లన్నసాగర్‌లో ఇండ్లు కలిస్తే ఒకాయన సజీవ దహనం చేసుకున్నాడన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఫండ్ కోట్ల రూపాయల్లో ఉందన్నారు. ఈ డబ్బులన్ని ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలన్నారు. హైదరాబాద్ ఇవ్వాళ మునగకపోతే రేపు మునగదా అంటూ ప్రశ్నించారు. విజయవాడ మునగలేదా..? ఖమ్మం మునగలేదా..? అందుకే మూసీ నది ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ఇష్టం వచ్చినట్టు కావాలనే మూసీ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. హరీష్ రావుకి షాద్ నగర్‌లో 70 ఎకరాల భూమి ఉందని.. రీజనల్ రింగ్ రోడ్డు ఈయన భూమి పక్క నుంచే పోతుందన్నారు.

Read Also: Train Accident: నంద్యాలలో పట్టాలు తప్పిన రైలు..

మైనంపల్లి ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. మీరు రెడీనా అంటూ బీఆర్‌ఎస్‌ నేతలకు మైనంపల్లి హనుమంతరావు ఛాలెంజ్ చేశారు. మేము ధర్నా చేస్తే పోలీసులతో అరెస్ట్ చేయించారు.. కానీ మిమ్మల్ని మేము చేయలేదన్నారు.మూసీ బాధితులకు అండగా ఉంటామన్నారు. బీఆర్‌ఎస్ వాళ్ళు రెచ్చగొడితే బాధితులు రెచ్చిపోవద్దన్నారు. విజయవాడలో వచ్చినట్టు వరద హైదరాబాద్‌లో వస్తే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించాలన్నారు. నెక్స్ట్ ప్రోగ్రాం సిద్దిపేటలో పెడుతామని.. బీఆర్‌ఎస్‌ చేసిన ఘనకార్యం మొత్తం బయటపెడుతామన్నారు. కొండగట్టు ప్రమాదంలో అంత మంది చనిపోతే కేసీఆర్ రాలేదన్నారు.మాసాయిపేట రైలు ప్రమాదం జరిగినప్పుడు రాలేదని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ అంటూ.. ఎల్బీ స్టేడియంలో ముగ్గురం తగలబెట్టుకుందాం రెడీనా అంటూ ఛాలెంజ్ చేశారు. మల్లన్నసాగర్ నిర్వాసిత 14 గ్రామాలను ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు.