NTV Telugu Site icon

Modi’s US Visit 2014: ‘నా తల్లి ఇల్లు మీ కారుతో సమానం’..10ఏళ్ల ముందు ఒబామాకు మోడీ చెప్పిన మాట

Modi

Modi

ప్రపంచ నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ స్నేహం గురించి తరచూ చర్చిస్తుంటాం. ప్రధాని మోడీ వ్యక్తిగత స్థాయిలో ప్రపంచస్థాయి నేతలతో కనెక్ట్ అవుతారని, తన జీవిత అనుభవాలను కూడా సులభంగా పంచుకుంటారని సమావేశాల్లో పీఎంతో పాటు వచ్చే అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. 2014లో ప్రధాని, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ప్రస్తుతం ప్రధానాంశాల్లో ఉంది. 2014లో మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

READ MORE: Bigg Boss 8 Telugu: మూడోవారంలో డేంజర్‌ జోన్‌లో ఉన్నది వీరిద్దరే..!

వినయ్ క్వాత్రా కథను పంచుకున్నారు

ప్రధాని మోడీ మూడు రోజుల అమెరికా పర్యటన సందర్భంగా… అమెరికాలోని భారత ప్రస్తుత రాయబారి, మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా 2014 నాటి చిరస్మరణీయ వృత్తాంతాన్ని పంచుకున్నారు. ప్రధాని, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య భావోద్వేగ సంభాషణ ఎలా జరిగిందో క్వాత్రా చెప్పారు. ప్రధానికి సంబంధించిన వ్యక్తుల అనుభవాలు, కథనాలను భద్రపరచడానికి పనిచేసే ‘మోడీ స్టోరీ’ వెబ్‌సైట్‌లో క్వాత్రా ఈ సంఘటనను పంచుకున్నారు. అధికారిక చర్చలు ముగిసిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు ఒబామా కలిసి.. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్ వైపు వెళ్తున్నారని క్వాత్రా చెప్పారు. ఇద్దరు నేతలు ఒబామా స్ట్రెచ్ లిమోసిన్‌లో కూర్చొన్నారు. పర్యటన సందర్భంగా.. కుటుంబానికి సంబంధించిన చర్చలు జరిగాయి. ఒబామా మోడీని తన తల్లి గురించి అడిగారు. అప్పుడు చిరునవ్వుతో పీఎం మోడీ.. “అధ్యక్షుడు ఒబామా.. మీరు నమ్మకపోవచ్చు. కానీ మీ ఈ కారు పరిమాణం.. దాదాపు నా తల్లి ఇంటికి సమానంగా ఉంటుంది” అని ఆకస్మికంగా ఊహించని సమాధానం ఇచ్చారు.

READ MORE: IND vs BAN: మూడో రోజు ముగిసిన ఆట.. విజయం ముంగిట భారత్

ఆశ్చర్యానికి గురైన ఒబామా ..

ప్రధాని మోడీ నుంచి ఈ మాటలు విని ఒబామా ఆశ్చర్యపోయారు. ఈ అంశంపై లిమోసిన్‌లో ఉన్న వినయ్ క్వాత్రా మాట్లాడుతూ.. ఈ సంభాషణ ఇద్దరు నాయకుల మధ్య లోతైన బంధానికి దారితీసిందని, ఇద్దరూ వినయపూర్వకమైన నేపథ్యాల నుంచి తమ తమ దేశాలలో అత్యున్నత స్థానాలకు చేరుకున్నారని చెప్పారు. 2014లో ప్రధాని అయిన తర్వాత ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఒబామా 1893 నాటి ‘ప్రపంచ మతాల పార్లమెంటు’పై అరుదైన పుస్తకాన్ని మోడీకి బహూకరించారు.