Modi’s US Visit 2014: ‘నా తల్లి ఇల్లు మీ కారుతో సమానం’..10ఏళ్ల ముందు ఒబామాకు మోడీ చెప్పిన మాట
- ప్రపంచ నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ స్నేహం
- తన జీవిత అనుభవాలను సులభంగా పంచుకున్న మోడీ
- పదేళ్ల కిందట మోడీ.. బరాక్ ఒబామా మధ్య ఆసక్తికర సంభాషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ స్నేహం గురించి తరచూ చర్చిస్తుంటాం. ప్రధాని మోడీ వ్యక్తిగత స్థాయిలో ప్రపంచస్థాయి నేతలతో కనెక్ట్ అవుతారని, తన జీవిత అనుభవాలను కూడా సులభంగా పంచుకుంటారని సమావేశాల్లో పీఎంతో పాటు వచ్చే అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. 2014లో ప్రధాని, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ప్రస్తుతం ప్రధానాంశాల్లో ఉంది. 2014లో మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
READ MORE: Bigg Boss 8 Telugu: మూడోవారంలో డేంజర్ జోన్లో ఉన్నది వీరిద్దరే..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
వినయ్ క్వాత్రా కథను పంచుకున్నారు
ప్రధాని మోడీ మూడు రోజుల అమెరికా పర్యటన సందర్భంగా… అమెరికాలోని భారత ప్రస్తుత రాయబారి, మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా 2014 నాటి చిరస్మరణీయ వృత్తాంతాన్ని పంచుకున్నారు. ప్రధాని, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య భావోద్వేగ సంభాషణ ఎలా జరిగిందో క్వాత్రా చెప్పారు. ప్రధానికి సంబంధించిన వ్యక్తుల అనుభవాలు, కథనాలను భద్రపరచడానికి పనిచేసే ‘మోడీ స్టోరీ’ వెబ్సైట్లో క్వాత్రా ఈ సంఘటనను పంచుకున్నారు. అధికారిక చర్చలు ముగిసిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు ఒబామా కలిసి.. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్ వైపు వెళ్తున్నారని క్వాత్రా చెప్పారు. ఇద్దరు నేతలు ఒబామా స్ట్రెచ్ లిమోసిన్‌లో కూర్చొన్నారు. పర్యటన సందర్భంగా.. కుటుంబానికి సంబంధించిన చర్చలు జరిగాయి. ఒబామా మోడీని తన తల్లి గురించి అడిగారు. అప్పుడు చిరునవ్వుతో పీఎం మోడీ.. “అధ్యక్షుడు ఒబామా.. మీరు నమ్మకపోవచ్చు. కానీ మీ ఈ కారు పరిమాణం.. దాదాపు నా తల్లి ఇంటికి సమానంగా ఉంటుంది” అని ఆకస్మికంగా ఊహించని సమాధానం ఇచ్చారు.
READ MORE: IND vs BAN: మూడో రోజు ముగిసిన ఆట.. విజయం ముంగిట భారత్
ఆశ్చర్యానికి గురైన ఒబామా ..
ప్రధాని మోడీ నుంచి ఈ మాటలు విని ఒబామా ఆశ్చర్యపోయారు. ఈ అంశంపై లిమోసిన్‌లో ఉన్న వినయ్ క్వాత్రా మాట్లాడుతూ.. ఈ సంభాషణ ఇద్దరు నాయకుల మధ్య లోతైన బంధానికి దారితీసిందని, ఇద్దరూ వినయపూర్వకమైన నేపథ్యాల నుంచి తమ తమ దేశాలలో అత్యున్నత స్థానాలకు చేరుకున్నారని చెప్పారు. 2014లో ప్రధాని అయిన తర్వాత ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఒబామా 1893 నాటి ‘ప్రపంచ మతాల పార్లమెంటు’పై అరుదైన పుస్తకాన్ని మోడీకి బహూకరించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..