Rahul Disqualification: రాహుల్‌గాంధీని అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని పార్లమెంటు హౌసింగ్ ప్యానల్ ఆదేశించడం.. గడువు పొడిగించాలని కూడా అడగకుండా ఖాళీ చేసేందుకు రాహుల్ సిద్ధపడిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటారు? అన్న చర్చ నడుస్తున్నది. అయితే.. రాహుల్‌కు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. రాహుల్ ఎక్కడ ఉండబోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ‘అవసరమైతే ఆయన తన తల్లి సోనియా గాంధీ టికి వెళతారు. లేదంటే నా బంగ్లా ఇస్తా’ అని బదులిచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ రాయ్ ప్రతీకాత్మకంగా తన ఇంటిని అంకితం చేశారు. మాజీ ఎమ్మెల్యే దంపతులు వారణాసి నగరంలోని లాహురాబీర్ ప్రాంతంలోని తమ ఇంటి వద్ద “మేరా ఘర్ శ్రీ రాహుల్ గాంధీ కా ఘర్ (నా ఇల్లు రాహుల్ గాంధీ ఇల్లు)” అని రాసి ఉన్న బోర్డును ఉంచారు. తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయమని లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసుకు రాహుల్ గాంధీ మంగళవారం సమాధానం ఇవ్వడంతో పాటు నోటీసుకు కట్టుబడి ఉంటానని చెప్పారు.
Read Also: Revanth Reddy: నా ఇంటికి రా భయ్యా అంటూ రేవంత్ ఎమోషనల్ ట్విట్.. ఎరికోసమో తెలుసా..
‘‘దేశంలోని నియంతలు రాహుల్‌గాంధీ నివాసాన్ని లాక్కోవాలనుకుంటున్నారు.. కానీ, దేశవ్యాప్తంగా కోట్లాది మంది పార్టీ కార్యకర్తల ఇళ్లు రాహుల్‌గాంధీ అని వారికి తెలియదు.. వారణాసి నగరంలో లాహురాబీర్ ప్రాంతంలోని మా ఇంటిని రాహుల్ గాంధీకి అంకితం చేశాం’’ అని అజయ్ రాయ్ అన్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా ఈ ప్రచారం కాశీతో సహా మొత్తం ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో ప్రారంభించబడిందని ఆయన అన్నారు. “గాంధీ కుటుంబం కోట్ల విలువైన ఆనంద్ భవన్ (ప్రయాగ్‌రాజ్‌లోని) మొత్తాన్ని జాతికి అంకితం చేసింది. బహిష్కరణ నోటీసు (రాహుల్ గాంధీకి) పంపడం బీజేపీకి పిరికిపంద చర్య,” అని అజయ్ రాయ్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని ఉత్తకప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ అన్నారు.
Read Also: Wayanad By-Election: వయనాడ్ ఉపఎన్నికపై ఉత్కంఠ.. కర్ణాటకతో పాటు ఈసీ షెడ్యూల్ ప్రకటిస్తుందా?
గత వారం క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తర్వాత లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఏప్రిల్ 22లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి సోమవారం నోటీసు అందింది. నిబంధనల ప్రకారం నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా బంగ్లా ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే.. గడువు పొడిగించాలని రాహుల్ విజ్ఞప్తి చేసుకుంటే ప్యానల్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నదని ఒక అధికారి చెప్పారు. కానీ.. తగ్గేదే లే అంటున్న రాహుల్.. కోర్టుకే క్షమాపణ చెప్పలేదు.. ప్యానల్‌ను గడువు పొడిగించాలని కోరుతానా? అన్నట్టు.. చెప్పిన టైమ్ లోపలే బంగ్లా ఖాళీ చేస్తానని లేఖ రాశారు.