ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి విడుదలై మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. అందులోనూ ఆహాలో కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. థియేటలలో సూపర్ హిట్ అయిన సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లు కూడా బాగానే విడుదల అవుతున్నాయి.. తాజాగా మరో సినిమా రాబోతుంది.. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమటం ఈ మధ్య హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్నారు.. రీసెంట్ గా మస్త్ షెడ్స్ ఉన్నాయిరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు..
ఇప్పుడు మరో కొత్త కాన్సెఫ్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘మై డియర్ దొంగ’. సినిమాలో నటిస్తున్నాడు.. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం ట్రైలర్ ను విడుదల చేశారు..
ఒక దొంగ దొంగతనం చేస్తూ ఓ అమ్మాయికి దొరికితే వాడి కష్టాలు చెప్పి ఆ అమ్మాయికి ఫ్రెండ్ గా ఎలా మారాడు? ఆ తర్వాత ఏం జరిగింది అనే సరికొత్త కాన్సెప్ట్ తో ఉండబోతున్నట్టు చూపించారు. మై డియర్ దొంగ సినిమా మొత్తం కామెడితో కడుపుబ్బా నవ్వించబోతున్నాడని ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది.. ఈ సినిమాను ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఆహా టీమ్.. ఇక అజయ్ అర్సడానే సంగీత దర్శకుడుగా వ్యవహారిస్తున్నాడు..