Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీలో ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదుల వెల్లువ.. పార్టీల పరస్పర ఫిర్యాదులు

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh: ఏపీలో ఎన్నికల వేళ.. ఈసీ వద్ద వివిధ పార్టీల ఫిర్యాదులతో పంచాయతీ నెలకొంది. ప్రతి ఎన్నికల్లోనూ ఉండే తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ ఒకరిపై ఒకరు ఈసీకి అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పర కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు. షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచి వైసీపీ – టీడీపీ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. చంద్రబాబు, పవన్ సహా ఇతర టీడీపీ నేతల కామెంట్లు, సోషల్ మీడియా ట్రోలింగ్స్‌పై వైసీపీ ఫిర్యాదులు చేస్తోంది. ఇప్పటి వరకు 150కు పైగా వైసీపీ ఫిర్యాదులు ఇచ్చింది. దొంగ ఓట్లు మొదలుకుని.. అధికార దుర్వినియోగం వరకు టీడీపీ వరుస ఫిర్యాదులు చేస్తోంది. దొంగ ఓట్ల వ్యవహరంలో ఐఏఎస్ సహా.. కొందరు అధికారుల సస్పెన్షన్ వరకు వ్యవహరం వెళ్లింది.

Read Also: Telangana Rains: చల్లబడిన వాతావరణం.. హైదరాబాదులో పలుచోట్ల భారీ వర్షం..

వాలంటీర్లు మొదలుకుని సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద టీడీపీ వరుస ఫిర్యాదులు చేసింది. కూటమి ఫిర్యాదులతో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఈసీ వేటు వేసింది. త్వరలో సీఎస్, డీజీపీలు కూడా బదిలీ అవుతారని ప్రచారం జరుగుతోంది. .జగన్ సహా మంత్రులు, ఇతర వైసీపీ నేతల కామెంట్లపై టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు 200కి పైగా టీడీపీ ఫిర్యాదులు చేసింది. ఫిర్యాదులపై ఎన్నికల సంఘం వివరణలు కోరుతోంది. సీఎస్, డీజీపీలపై వచ్చిన ఫిర్యాదులపై ఈసీ వివరణ తీసుకుంది. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు వివరణ కోరుతూ ఈసీ కూడా వందకు పైగా నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

Exit mobile version