NTV Telugu Site icon

Muthireddy Yadagiri Reddy: ఆర్టీసీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా

Muttireddy

Muttireddy

Muthireddy Yadagiri Reddy: టీఎస్ఆర్టీసీ కొత్త చైర్మన్గా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇంతకుమందు వరకు టీఎస్ ఆర్టీసీచైర్మన్గా బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి కొనసాగారు. తాజాగా ఆయన స్థానంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. రెండు సంవత్సరాల పాటు ముత్తిరెడ్డి కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధ్యం అవుతుందా అని అనుకున్నాం… కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. ఆనాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసిఆర్ రాష్ట్రంపై పూర్తి అవగాహన కలిగిన ముఖ్యమంత్రిగా తెలంగాణను కాపాడే క్రమంలో అనేక సంస్కరణలు చేశారని పేర్కొన్నారు. అన్ని విభాగాలను అభివృద్ధి చేశారని ముత్తిరెడ్డి తెలిపారు.

Read Also: Boyapati Srinu: కుదరలేదంతే… మరి కుదిరితే ఊచకోతేనా?

ఒకప్పుడు తెలంగాణ ఎక్కడ ఉంటుంది అని అడిగేవారని.. కానీ ఇప్పుడు హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపారని ముత్తిరెడ్డి తెలిపారు. వారి ఫాలోవర్ గా తనకు అప్పగించిన బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. భారత దేశంలోని మున్సిపాలిటీలలో జనగాం 3వ స్థానంలో నిలిచిందన్నారు. వారి సారథ్యంలో పనిచేస్తున్నానని… ఇప్పుడు వారి ఆశీర్వాదంతో ఆర్టీసీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టానని ముత్తిరెడ్డి తెలిపారు. దక్షత గల ఎండీ సజ్జనార్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఆర్టీసీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు, కార్మికులకు లాభం చేకూరే లాగా ప్రభుత్వంతో చర్చించి అన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.

Read Also: ODI World Cup 2023: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌.. న్యూజిలాండ్‌కు భారీ షాక్‌!

Show comments