నేడు టీఎస్‌ఆర్టీసీ కొత్త చైర్మన్‌గా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ముత్తిరెడ్డికి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఆయన జనగామ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. అయితే.. ఇప్పటివరకు టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి కొనసాగారు. ఆయన స్థానంలో ఇప్పుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. ముత్తిరెడ్డి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. అయితే ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీలో అసంతృప్తిని చల్లార్చడంపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కని నేతలను ఛైర్మన్ స్థానాల్లో కూర్చోబెట్టింది. వారికి కీలక బాధ్యతలను అప్పగించింది బీఆర్‌ఎస్ సర్కార్. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతుబంధు చైర్మన్‌గా తాటికొండ రాజయ్యను నియమించింది ప్రభుత్వం. ఇక.. రాష్ట్ర ఎంబీసీ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ గుప్తా నియమితులయ్యారు. వీరి నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : OMG 2: అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చిన అక్షయ్ కుమార్ ‘ఓఎంజీ 2’ సినిమా.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిపడ్డాయి. ఆదే సమయంలో టికెట్లు ఆశించి భగ్గపడ్డవారికి తగిన స్థానం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే బీఆర్‌ఎస్ 119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. అందులో 7 స్థానాల్లో సిట్టింగ్‌లకు ఈ సారి అవకాశం దక్కలేదు. అంతేకాకుండా.. 4 స్థానాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు బీఆర్‌ఎస్. అయితే.. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జోరుతా సాగుతోంది.
Also Read : Israel-Palestine War: గత 24 గంటలుగా కొనసాగుతున్న యుద్ధం.. ఎన్ని వందల మంది మరణించారంటే ?