Vijay : తమిళ హీరో విజయ్ చిక్కుల్లో పడ్డాడు. ఆయన మీద కేసు నమోదైంది. ఇఫ్తార్ విందును అవమానించారంటూ ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సౌత్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన విజయ్.. రీసెంట్ గానే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించారు. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ముస్లిం పెద్దలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ సందర్భంగా చెన్నైలోని రాయపేట వైఎంసీఏ మైదానంలో విజయ్ ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఇందులో విజయ్ స్కల్ క్యాప్ ను ధరించి ఉపవాసం ముగించే టైమ్ లో ప్రార్థనలో పాల్గొన్నారు. అయితే ఈ ఇఫ్తార్ విందుపై సున్నత్ జమాత్ అనే ముస్లిం సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : SSMB-29: హనుమంతుడి స్ఫూర్తితో ఎస్ ఎస్ ఎంబీ-29 కథ.. అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్..?
తాము ఎంతో పవిత్రంగా భావించే ఇఫ్తార్ విందును విజయ్ అవమానించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ” విజయ్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముస్లింలకు తీవ్ర అవమానం జరిగింది. ఆ విందులో కొందరు తాగుబోతులు, ఉపవాసం లేని వారు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు అంటే అత్యంత పవిత్రతతో ఉపవాసం ఉన్న ముస్లింలు మాత్రమే చేయాలి. కొందరు బాడీగార్డులు అక్కడ ముస్లింలను నెట్టేశారు. ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమే’ అంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విజయ్ టీమ్ ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. ప్రస్తుతం విజయ్ తన చివరి సినిమాలో నటిస్తున్నాడు. అది కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే వస్తుందని సమాచారం.
Read Also : Ranya Rao: పెళ్లైన రెండు నెలల నుంచే.. భర్త ఫిర్యాదుతో అడ్డంగా బుక్కైన నటి