NTV Telugu Site icon

Monditoka Jagan Mohan Rao: ముస్లిం మైనార్టీలందరూ వైసీపీని గెలిపించండి..

Moditoka

Moditoka

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలందరూ ఏకమై.. వైసీపీని గెలిపించి ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి అని పిలుపునిచ్చారు. ముస్లింలు మనఃశాంతిగా ఆత్మ గౌరవంగా బతకాలంటే మతాల మధ్య కులాల మధ్య చిచ్చు లేకుండా ప్రతి ఒక్కరూ సమానత్వంతో బతకాలంటే రానున్న ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఓటు మొండితోక జగన్ మోహన్ రావుకు, ఎంపీ ఓటు కేశినేని నానికి వేసి గెలిపించాలని ఆయన కోరారు. కాగా, ముస్లిం కమ్యూనిటీలో ఉన్న గురువులు, ఇమాములు, మత పెద్దలు అందరూ ఏకతాటిపై వచ్చి వైసీపీ విజయానికి కృషి చేయాలని హాఫిజ్ ఖాన్ తెలిపారు.

Read Also: Gangs of Godavari : విశ్వక్ సేన్ మూవీ నుంచి ‘బ్యాడ్’ థీమ్ సాంగ్ రిలీజ్..

ఇక, బహిరంగ సభలో సీఎం జగన్ దమ్ము, ధైర్యంతో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని చెప్పారని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ తెలిపారు. ఇది జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట.. దీనికోసం ఎంత వరకైనా పోరాడతానని జగన్ చెప్పారు.. కానీ, చంద్రబాబు నాయుడు అంత ధైర్యంగా ప్రధాన మంత్రి ముందు చెప్పగలడా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రధాని మంత్రి మోడీ ముందు ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? అంటూ అడిగారు. బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటుంది.. పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తామంటున్నాడు.. రెండు నాలుకల ధోరణితో చంద్రబాబు నాయుడు ఉన్నాడని హాఫిజ్ ఖాన్ మండిపడ్డారు.

Read Also: AP Elections 2024: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ..

ఇక, ముస్లిం మైనార్టీలు అందరూ వైసీపీకి మద్దతు ఇవ్వండి.. 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి అని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ కోరారు. గత ఐదు సంవత్సరాలుగా ముస్లింలందరూ ఎంతో ప్రశాంతంగా ఉన్నారు.. ముఖ్యమంత్రి జగన్ అనేక పదవులు ముస్లింలకు ఇచ్చారు.. ఈ ప్రభుత్వంలో ముస్లింలు అనేక విధాలుగా లబ్ది పొందారని ఆయన చెప్పుకొచ్చారు.

PM Narendra Modi First Ever Exclusive Interview With NTV Telugu