Site icon NTV Telugu

Thangalaan: మరో ఇండియన్‌ మూవీ చరిత్ర సృష్టించనుంది.. త్వరలోనే ట్రైలర్‌: జీవీ ప్రకాశ్‌కుమార్‌

Thangalaan Movie

Thangalaan Movie

GV Prakash Kumar about Vikram’s Thangalaan Movie Trailer: చియాన్ విక్రమ్‌ హీరోగా నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. పా రంజిత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో గ్రీన్, నీలమ్‌ ప్రోడక్షన్స్‌పై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన తంగలాన్ టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌కుమార్‌ తంగలాన్ అప్‌డేట్‌ ఇచ్చారు.

త్వరలోనే తంగలాన్‌ ట్రైలర్‌ రానున్నట్లు జీవీ ప్రకాశ్‌కుమార్‌ తెలిపారు. ‘తంగలాన్‌ చిత్రం మ్యూజిక్‌ పనులు పూర్తయ్యాయి. నాకు సాధ్యమైనంతవరకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాను. పాటలు అందరికీ నచ్చుతాయి. ఇక సినిమా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే చిత్ర యూనిట్ మైండ్‌ బ్లోయింగ్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. మరో ఇండియన్‌ మూవీ చరిత్ర సృష్టించనుంది’ అని జీవీ ప్రకాశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Also Read: Sudheer Babu New Movie: సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో సుధీర్ బాబు.. భారీ బ‌డ్జెట్‌, పాన్ ఇండియా లెవ‌ల్లో ప్లాన్!

తంగలాన్‌ సినిమాను తొలుత 2024 జనవరిలో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్‌కు వాయిదా వేశారు. అప్పుడు కూడా చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు. ఇక ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు కానీ.. అదే తేదీలో తంగలాన్‌ రిలీజ్ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆగష్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 వాయిదా పడడం తంగలాన్ సినిమాకు కలిసొచ్చే అంశం. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Exit mobile version