Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain Alert for AP and Telangana: ‘అర్నబ్’ తుఫాన్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో తీవ్ర తుఫాన్ ‘మురసు’ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ తీవ్రంగా బలపడటంతో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
మురసు తుఫాన్ ప్రస్తుతం గంటకు సుమారు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం కావలికి సుమారు 220 కిలోమీటర్లు, నెల్లూరుకు 210 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ ఉంది. తుఫాన్ ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
Also Read
- Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
- Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
- మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
- Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు 'మనమిత్ర' అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
తెలంగాణలోనూ మురసు తుఫాన్ ప్రభావం కనిపించనుంది. సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, జనగామ, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు అవకాశాలు ఉన్నాయి. హనుమకొండ, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
పంటలు కోతకు వచ్చిన సమయంలో వరుస తుఫాన్లు, భారీ వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే అర్నబ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు.. ఇప్పుడు మురుసు తుఫాన్ ప్రభావంతో మరింత నష్టం వాటిల్లుతుందేమోనని భయపడుతున్నారు. పొలాల్లో పంటలు నేలకొరిగితే, కోతకు వచ్చిన ధాన్యం తడిసిపోతే తీవ్ర ఆర్థిక నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
-
Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
-
Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!