Site icon NTV Telugu

Mumbai: 30 ఏళ్ల క్రితం మర్డర్.. మందు ఎక్కువై దొరికేశాడు..!

Mumbai

Mumbai

Mumbai: తాగితే మనసులోని నిజాలు బయటకు కక్కేస్తారంటే ఇదేనేమో.. లోనావాలాకు చెందిన అవినాష్ పవార్ అనే వ్యక్తి 1993లో ఒక వృద్ధ జంటను హత్యచేసి.. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన కొన్ని వస్తువులను దోచుకెళ్లాడు. అక్కడి నుంచి ఔరంగాబాద్ కు మకాం మార్చిన.. అవినాష్ పరారీలో ఉండి 30 ఏళ్ళు కింగ్ లా బ్రతికాడు. ఏదైతే నిజం చెప్పకూడనది ఉందో.. ఆ నిజాన్ని ఓ ఫంక్షన్లో ఫుల్ గా తాగి ఆ మర్డర్ గురించి బయటకక్కేశాడు.

Read Also: Off The Record : ఏపీలో బీజేపీ స్పీడ్ పెరగనట్టేనా.? ఎందుకు బీజేపీ నమ్మకం కోల్పోతోంది.?

లోనావాలాలో చిన్న వ్యాపారం చేసుకునే అవినాష్ పవార్ అనే వ్యక్తి.. ఇద్దరు సహచరులతో కలిసి ఒక ఇంట్లోకి చొరబడి వృద్ధ జంటను హత్య చేసి వారింట్లో దొంగతనం చేశారు. తర్వాత పోలీసు విచారణలో మిగతా ఇద్దరు పట్టుబడగా.. అవినాష్ మాత్రం తన తల్లిని అక్కడే విడిచిపెట్టి ఢిల్లీ పారిపోయాడు. అప్పటికి అవినాష్ వయసు 19 ఏళ్ళు. తర్వాత ఔరంగాబాద్ చేరుకుని అక్కడ అమిత్ పవార్ గా పేరు మార్చుకున్నాడు. అక్కడ నుండి పింప్రి-చించ్వాడ్, అహ్మద్ నగర్ అటునుంచి చివరికి ముంబై చేరుకొని అక్కడే సెటిల్ అయ్యాడు. ఆధార్ కార్డులో కూడా పేరు మార్చుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. తన భార్య రాజకీయంగా ఎదగడానికి కూడా తోడ్పడ్డాడు.

Read Also: Gidugu Rudraraju: ఏపీలో నిశ్శబ్ద విప్లవం రానుంది.. ప్రజలంతా కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు

ప్రస్తుతం పవార్ వయసు 49 ఏళ్ళు. ఈ ముప్పై ఏళ్లలో అతను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ దురదృష్టవశాత్తు మందు మైకంలో అప్పుడు చేసిన మర్డర్ గురించి ఒక అజ్ఞాతవ్యక్తి దగ్గర వాగి దొరికిపోయాడు. ఆ వ్యక్తి నుండి సమాచారం అందుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ స్వయంగా రంగంలోకి దిగి పవార్ ను అరెస్టు చేశారు. 30 ఏళ్ల క్రితం జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ పవార్ అలియాస్ అమిత్ పవార్ కోసం గాలిస్తూనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి ఇద్దరు సహచరులు పట్టుబడినా ఇతను మాత్రం తప్పించుకున్నాడని.. ఇన్నాళ్లుగా పవార్ తన తల్లిని గాని తన భార్య తల్లిదండ్రులను గాని చూడటానికి రాలేదని పోలీసులు పేర్కొన్నారు.

Exit mobile version