NTV Telugu Site icon

Munugode Bypoll Polling Live Updates: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ లైవ్ అప్ డేట్స్

munugode 1

0cfcd117 97fc 431e Bcb4 25ad4410e281

నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభం అయింది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం.. 2,41,795 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో.. పురుషులు 1,21,662 కాగా.. మహిళలు 1,20,126 మంది ఉన్నారు. అంతేకాకుండా.. థార్డ్ జెండర్ 07, ఎన్నారై 10, సర్వీసు ఓటర్లు 50, వికలాంగులు 5686 ఓట్లు ఉన్నాయి. అయితే.. పోస్టల్ బ్యాలెట్స్ 318 కాగా.. ఎన్నికల బరిలో 47 మంది ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 298 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు.

The liveblog has ended.
  • 03 Nov 2022 08:30 PM (IST)

    8 గంటల వరకు 86 శాతం పోలింగ్‌

    మునుగోడు ఉప ఎన్నికలో రాత్రి 8 గంటల వరకు 86 శాతం పోలింగ్‌ పూర్తి అయ్యింది. ఇంకా 13 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

  • 03 Nov 2022 07:20 PM (IST)

    చీకట్లోనే పోలింగ్‌

    చండూరులో ప్రాథమిక పాఠశాలలో చీకట్లోనే పోలింగ్‌. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కేంద్రంలో ఓటువేసేందుకు వేచిఉన్న దాదాపు 100మంది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా మునుగోడు పోలింగ్‌. మునుగోడులో పోలింగ్‌ సమయం ముగిసి గంటైనా కొన్నిచోట్ల బారులు తీరిన ఓటర్లు.

  • 03 Nov 2022 06:36 PM (IST)

    పలు పోలింగ్‌ కేంద్రాలలో ఓట్లర్లు బారులు

    మర్రిగూడ మండలం రామిరెడ్డి పల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. ఒకటే పోలింగ్ బూత్ ఉండటంతో పోలింగ్‌ ఆలస్యమయ్యేలా ఉంది. అయితే..దీంతో పాటు.. నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉండటంతో.. వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.

  • 03 Nov 2022 06:31 PM (IST)

    రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ ప్రెస్‌మీట్‌

    పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. బయటి నుంచి వచ్చిన వారిపై కంప్లైంట్స్‌ వచ్చాయి, వారిని వెంటనే పంపించివేశాం. స్ల్రాంగ్‌ రూమ్స్‌కు ఈవీఎంలను తరలిస్తాం. కౌంటింగ్‌లో మైక్రో అబ్జార్వర్స్‌కు ట్రైనింగ్‌ ఇచ్చాం. ఈ నెల 6న కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎకడా రీపోలింగ్‌ అవసరం రాకపోవచ్చు.

  • 03 Nov 2022 06:08 PM (IST)

    ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌

    మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌ ముగిసింది. ఇప్పటికీ చాలా పోలింగ్‌ కేంద్రాల్లో భారీగా క్యూలైన్లు. క్యూ లైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం.

  • 03 Nov 2022 05:16 PM (IST)

    5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్‌

    మునుగోడు ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్‌ నమోదు.

  • 03 Nov 2022 05:07 PM (IST)

    మరో గంటలో ముగియనున్న పోలింగ్‌

    మరో గంటలో ముగియనున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌. సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటేసే అవకాశం. చివరి గంటలో భారీగా పోలింగ్‌ నమోదయ్యే అవకాశం.

  • 03 Nov 2022 04:54 PM (IST)

    మునుగోడులో ప్రశాంతంగా పోలింగ్‌

    మునుగోడులో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లలో ఓట్లరు బారులు తీరారు.

  • 03 Nov 2022 04:25 PM (IST)

    చండూరులో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.

    చండూరులో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. పోలీసుల లాఠీ ఛార్జ్‌. కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు. స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్‌ కార్యకర్తల ఆందోళన.

  • 03 Nov 2022 04:06 PM (IST)

    రాజగోపాల్ రెడ్డి విచ్చల విడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు : బడుగుల లింగయ్య యాదవ్‌

    రాజగోపాల్ రెడ్డి మునుగోడులో విచ్చల విడిగా డబ్బు, మధ్యం పంపిణీ చేస్తున్నారు. చౌటుప్పల్ లో డబ్బు పంపిణీ విపరీతంగా పంపిణీ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంను బీజేపీ కూని చేస్తుంది. మతోన్మద బీజేపీ మత, కుల రాజకీయాలు చేస్తుంది. బీజేపీ పైసలు పంచుకుంటు మా పై ఆరోపణ చేస్తుంది. మోడీ, అమిత్ షా కుట్ర చేసి ఈ ఎన్నిక తెచ్చారు. మునుగోడులో 15 బలగాలు పెట్టీ రణ రంగం అయినట్టు బీజేపీ సృష్టిస్తుంది. -బడుగుల లింగయ్య యాదవ్

  • 03 Nov 2022 03:21 PM (IST)

    మధ్యాహ్నం 3గంటల వరకు 59.92 శాతం పోలింగ్‌

    మునుగోడు ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3గంటల వరకు 59.92 శాతం పోలింగ్‌. పోలింగ్‌ బూత్‌ల వద్ద భారీగా క్యూలైన్లు.

  • 03 Nov 2022 03:01 PM (IST)

    సీఈఓకు టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

    మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని సీఈఓ వికాస్ రాజ్ కు టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో పాటు దాసోజు శ్రవణ్, రమేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

  • 03 Nov 2022 02:17 PM (IST)

    రంగంబాయ్ తండా వాసుల నిరసన

    తమ తండాకు సీసీరోడ్లు కావాలని ఏనాటినుంచో అడుగుతున్నా.. నేతలు పట్టించుకోవడం లేదన్నారు తండా వాసులు.. 75 ఏళ్ళనుండి తండాకు అభివృద్ధి లేదన్నారు. వర్షాకాలం వచ్చిందంటే సరైన వైద్యం అందడం లేదని, బయటకు వెళ్లాలంటే రోడ్లు లేవంటున్నారు. అందుకే తాము పోలింగ్ కి వెళ్ళడం లేదన్నారు.

  • 03 Nov 2022 01:44 PM (IST)

    బీజేపీపై టీఆర్ఎస్ ఫిర్యాదు

    బీజేపీ నేతలపై ఈసీకి కంప్లైంట్ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. చౌటుప్పల్ పట్టణం, నారాయణపేట లోని జనగామ, చండూరు, మర్రిగూడలోని తమ్మలపల్లి వంటి గ్రామాల్లో భారీ ఎత్తున బిజెపి మద్యం మరియు నగదును పంపిణీ చేస్తుంది.  అక్రమంగా బిజెపి మద్యం డబ్బులు పంపిణీ చేయడాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలి. నిన్న రాత్రి నుంచి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ధర్నాలు, నిరసనలు చేయడంతో పాటు ఈరోజు భారీగా నగదు పంపిణీ చేస్తూ... క్షేత్రస్థాయిలో అధికారుల పైన బెదిరింపులకు దిగుతుందని వికాస్ రాజ్ కు తెలిపిన మంత్రి జగదీశ్ రెడ్డి. ఈ విషయంలో ఎలక్షన్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని వికాస్ రాజ్ ని కోరిన మంత్రి జగదీష్ రెడ్డి

  • 03 Nov 2022 12:53 PM (IST)

    మేం ఓటు వేయం.. అంతంపేట గ్రామస్తుల నిరసన

    మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఉదయం కంటే ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగింది. అంతంపేట వాసులు ఓటు వేసేందుకు నిరాకరిస్తున్నారు. లంచ్ టైం కావడంతో కొంచెం మందగించింది. 12 గంటలకు 30 శాతం నమోదైంది. డబ్బులిస్తామని ఇవ్వకపోవడంతో అంతంపేట వాసులు నిరసన తెలుపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ 30శాతం ఓటింగ్ నమోదైంది. లంచ్ టైం కావడంతో తగ్గిన పోలింగ్.. క్యూలలో మహిళా ఓటర్లే కీలకం.. కొత్త ఓటర్లు ఉత్సాహంగా ఓటేస్తున్నారు

  • 03 Nov 2022 12:07 PM (IST)

    ఓటర్లు ఓటేయాలి-వికాస్ రాజ్

    మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ చోటు చేసుకొంది. పోలీసులు వెంటనే వారిని చెదరగొట్టారు. స్థానికేతరులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి..42 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపారు.. ఓటు కోసం డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం తప్పు. ఓటుకు డబ్బు ప్రస్తావనకు రావడం దురదృష్టకరం. ఓటర్లు అందరూ బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలి. గతంలో కంటే ఎక్కువ ఓటింగ్ జరిగేలా చూడాలి.

     

  • 03 Nov 2022 12:04 PM (IST)

    ప్రశాంతంగా ఎన్నికలు- వికాస్ రాజ్

    తంలో 91 శాతం పోలింగ్ జరిగిందని, ఈసారి కూడా అంతే స్థాయిలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్ల అవగాహన కల్పిస్తున్నాం. ఓటర్లకు డబ్బులివ్వడం, తీసుకోవడం నేరం. ఓటర్లు డబ్బులు తీసుకోకూడదన్నారు. స్థానికేతరులు వుండకూడదన్నారు. ఎవరైనా వున్నట్టు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం... ఈసీఐలో సోషల్ మీడియా సెల్ వుంది. ఆ కంపెనీతో తీయిస్తామన్నారు. పాల్వాయి స్రవంతి ఫిర్యాదును పరిళీలిస్తాం.

  • 03 Nov 2022 11:25 AM (IST)

    11 గంటల వరకూ 25శాతం పోలింగ్

    మునుగొడు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక లో ఉదయం 11:00 గంటల వరకు పోలింగ్ 25.8% నమోదు అయింది. ఇప్పడిప్పుడే పోలింగ్ శాతం పెరుగుతోంది.

  • 03 Nov 2022 11:11 AM (IST)

    పుంజుకుంటున్న పోలింగ్.. బూత్ ల దగ్గర రద్దీ

    మునుగోడు ఉప ఎన్నికల్లో పోలింగ్ పెరుగుతోంది. బూత్ ల దగ్గర రద్దీ కొనసాగుతోంది. యువత, మహిళలు పోలింగ్ బూత్ లకు తరలి వచ్చారు. గుర్తింపు కార్డులను పరిశీలించి వారిని లోపలికి పంపిస్తున్నారు సిబ్బంది. పోలింగ్ ప్రారంభం అయి నాలుగంటలవుతోంది. ఇప్పటివరకూ 20 శాతం వరకూ పోలింగ్ జరిగిందని తెలుస్తోంది. ఎన్నికల అధికారులు వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.

  • 03 Nov 2022 10:52 AM (IST)

    చండూరు పోలింగ్ బూత్ దగ్గర అపశృతి

    చండూరు పోలింగ్ బూత్ దగ్గర అపశృతి చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఇనుప గ్రిల్స్ లో ఇరుక్కున్న మహిళ కాలు.. దీంతో అప్రమత్తం అయిన అధికారులు మహిళ కాలుని బయటకు తీసే ప్రయత్నాలు చేశారు.

  • 03 Nov 2022 10:37 AM (IST)

    మునుగోడు ఉప ఎన్నిక సంగ్రామం

  • 03 Nov 2022 10:12 AM (IST)

    కొంపల్లిలో మొరాయించిన ఈవీఎంలు

    మునుగోడు నియోజక వర్గంలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. మర్రిగూడలో బీజేపీ నాయకుల ఆందోళన చేపట్టారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఓటర్లను మభ్యపెడుతున్నారంటూ బీజేపీ శ్రేణులు ఆరోపించారు. గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు మర్రిగూడలో ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. పోలింగ్‌ నిలిపివేయాలంటూ పోలీసులతో బీజేపీ శ్రేణులు వ్యాగ్వాదానికి దిగారు. సిద్దపేటకు చెందిన వ్యక్తులను పోలీసులకు బీజేపీ కార్యకర్తలు అప్పగించారు. వీడియోలు తీస్తున్నామనే నెపంతో బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. బీజేపీ శ్రేణులు అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగారు కార్యకర్తలు. దీంతో అక్కడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిపై లాఠీ చార్జ్‌ చేసి అక్కడనుంచి వెల్లగొట్టారు. అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.  కొంపల్లి 145వ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం లు మొరాయించాయి. 25 ఓట్లు పోలయ్యాక ఈవీఎంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఈవీఎం మొరాయింపుతో గంటనుంచి పోలింగ్‌ నిలిచింది.

  • 03 Nov 2022 10:11 AM (IST)

    11.20 శాతం పోలింగ్‌ నమోదు

    తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గంలో 9గంటల వరకూ 11.20 శాతం పోలింగ్‌ నమోదైంది. తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటివరకు 11.20శాతం ఓటింగ్ నమోదైంది. ఉప ఎన్నికలో 2,41,855 మంది ఓటు వేయనున్నారు.

  • 03 Nov 2022 09:41 AM (IST)

    ఫేక్ ప్రచారంపై రేవంత్ ఫైర్

    పాల్వాయి స్రవంతి కేసీఆర్ తో భేటీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో బరితెగించింది. కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ స్రవంతిపై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం చేస్తోంది. తమ ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారు.

  • 03 Nov 2022 09:36 AM (IST)

    పాల్వాయి స్రవంతి కంప్లైంట్.. పరిశీలిస్తున్నామన్న వికాస్ రాజ్

    కాంగ్రెస్ అభ్యర్థి తనపై సోషల్ మీడియాలో ఒక ఛానల్ తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై పాల్వాయి స్రవంతి కంప్లైంట్ చేశారు. సీఈఓకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు సీఈఓ తెలిపారు.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామన్నారు. మునుగోడులో ఉన్న నాన్ లోకల్ లను గుర్తించి 6 గురిపై కేస్ లు పెట్టాం అన్నారు.

  • 03 Nov 2022 09:32 AM (IST)

    మర్రిగూడలో ఉద్రిక్తత

    నల్లగొండ జిల్లా మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మర్రిగూడ మండల కేంద్రంలో ఉద్రిక్తత..పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

  • 03 Nov 2022 09:10 AM (IST)

    పోలింగ్ బూత్ లకు పోటెత్తిన ఓటర్లు

    మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. మర్రిగూడ మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికేతరులు వున్నారని ఇరు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కంప్లైంట్ చేసినా గజ్వేల్, సిద్దిపేట టీఆర్ఎస్ నేతలు ఇక్కడే వున్నారని, టీఆర్ఎస్ కి ఓటేయాలని లేకుంటే పెన్షన్లు రద్దుచేస్తామని టీఆర్ ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.

  • 03 Nov 2022 08:54 AM (IST)

    ప్రశాంతంగా పోలింగ్.. వికాస్ రాజ్, సీఈఓ

     నిన్న జరిగిన ఘటనల పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.నాన్ లోకల్ వాళ్ళు ఇంకా మునుగోడు లో ఉన్నారని ఫిర్యాదు అందింది.రెండు గ్రామాల్లో ఎన్నికల సిబ్బంది ఇతరుల దగ్గర నుండి డబ్బులు, కొన్ని వస్తువులు పట్టుకున్నారు. 2 పొలింగ్ స్టేషన్ లలో evm బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది సెట్ చేశాము. ఆ రెండు evm లు పని చేస్తున్నాయి. 298 పొలింగ్ స్టేషన్లలో ప్రశాoతంగా పోలింగ్ జరుగుతుంది. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ పరిస్థితులు గమనిస్తున్నాను.
  • 03 Nov 2022 08:21 AM (IST)

    కేసీఆర్-పాల్వాయి స్రవంతి భేటీ.. ఫేక్ ప్రచారం

    ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బిజెపి నేతలు కుట్రలు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. పార్టీ మారానని ప్రచారం చేస్తున్న వారి పైన ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు పాల్వాయి స్రవంతి.

     

  • 03 Nov 2022 08:19 AM (IST)

    ఓటేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

    మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని లింగ వారి గూడెం లో ఓటు హక్కు వినియోగించుకున్న టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. భారీగా తరలివచ్చిన ఓటర్లు

  • 03 Nov 2022 08:09 AM (IST)

    ఇదంతా బీజేపీ కుట్ర.. పాల్వాయి స్రవంతి

    ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బిజెపి నేతలు కుట్రలు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. పార్టీ మారానని ప్రచారం చేస్తున్న వారి పైన ఈసీకి పిర్యాదు చేస్తాను..బీజేపీ నేతల కుట్రనే ఇది..కాంగ్రెస్ శ్రేణులు..మునుగోడు ప్రజలు పూర్తిగా గమనించాలి. అమ్ముడు పోయే వారే. ఈ ప్రచారం చేస్తున్నారు.. కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాను. కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు. అధికారంలో ఉన్న రెండు పార్టీలో సామాన్యుల పైనా కూడా దాడులు చేస్తున్నాయి..ఒక్క ఆడపిల్లను ఎదుర్కొనే లేక ఈ ప్రచారం చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాళ్ళను గుర్తించాలి అంటున్నారు పాల్వాయి స్రవంతి.

  • 03 Nov 2022 07:43 AM (IST)

    బండి సంజయ్ అరెస్ట్. నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం

    బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ ని కార్యకర్తలు, మీడియా కళ్ళు కప్పి వేరే రూట్ లో తీసుకెళ్లిన పోలీసులు.. నాంపల్లి కోర్టు లో హాజరు పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. అర్థరాత్రి నల్గొండ హైవే పై హైడ్రామా నెలకొంది. ఈ మేరకు హైదరాబాద్ నుండి మునుగోడుకు బయలుదేరారు. కానీ విషయం తెలుసుకున్న పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకున్నారు. కానీ కార్యకర్తల సహాయంతో ఆయన కాన్వాయ్ ముందుకు వెళ్ళింది. బండి సంజయ్‌తో పోలీసులు చర్చలు జరిపారు. అయినా ముందుకు కారును తీసుకువెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. నడి రోడ్డు పై ధర్నాకు కూర్చున్న బండి సంజయ్ నిరసన తెలిపారు.

  • 03 Nov 2022 07:39 AM (IST)

    కేసీఆర్ తో పాల్వాయి స్రవంతి భేటీ అంటూ ఫేక్ ప్రచారం

    మునుగోడు ఉప ఎన్నికల వేళ ఫేక్ ప్రచారాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారని వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇది ప్రత్యర్థుల కుట్ర అని ఆమె ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

  • 03 Nov 2022 07:37 AM (IST)

    మునుగోడులో 50 మంది సర్వీస్ ఓటర్లు

    ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మునుగోడులో 50 మంది సర్వీసు ఓటర్లు వున్నారు.199 మంది మైక్రో అబ్జర్వర్లు వున్నారు. అన్ని బూత్ లలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటుచేశారు. 5 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు వున్నారు. మొత్తం 2 లక్షల 41 వేల 855 మంది ఓటర్లు వున్నారు. 5686 బ్యాలెట్ ఓట్లు వున్నాయి.

  • 03 Nov 2022 07:27 AM (IST)

    ఈనెల 6న మునుగోడు ఫలితాలు

    మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ఉ దయం 7 గంటలకు మొదలయింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా కొనసాగుతుంది. ఉప ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి మొత్తం 47 మంది బరిలో ఉన్నారు. ఆ తర్వాత ఈ నెల 6న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.బీజేపీ తరఫున రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున పాల్వాయి స్రవంతి . ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఇండిపెండెంట్ గా బరిలో వున్నారు.

  • 03 Nov 2022 07:20 AM (IST)

    పుట్టపాకలో భారీగా సామాగ్రి,డబ్బు స్వాధీనం

    నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్ హాల్ లో వేరే ప్రదేశాల నుండి వచ్చిన వారు ఫంక్షన్ హాల్ లో ఉన్నారని తెలుసుకున్న అబ్జర్వర్....అక్కడ సామాగ్రి, డబ్బులు పట్టుకున్న అబ్జర్వర్ సమత

  • 03 Nov 2022 07:06 AM (IST)

    మునుగోడులో పోలింగ్ ప్రారంభం

    మునుగోడులో ప్రారంభం అయిన ఉప ఎన్నిక పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసింది ఈసీ.