NTV Telugu Site icon

Quthbullapur: పారిశుధ్య కార్మికురాలిని లైంగికంగా వేధిస్తున్న మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్..

Hyd

Hyd

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో ఎస్ఏఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే కామాంధుడు తన కింద పని చేసే ఓ కార్మికుకురాలిపై కన్నేసాడు. ఎలాగైనా ఆమెను శారీరకంగా అనుభవించాలని నిర్ణయించుకున్న అతను ఆమెపై అధికారి అనే అస్త్రాన్ని ఉపయోగించాడు. తాను చెప్పినట్లు వినాలని లేదంటే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టాడు. అధికారి వేధింపులకు తాళలేక ఎవరికి చెప్పలేక నరక యాతన అనుభవిస్తున్న కార్మికురాలు అతని చెరలో పడక తప్పలేదు. రోజు పనికి వచ్చిన ఆమెను ఓ గదిలోకి తీసుకు వెళ్లి లైంగికంగా వాడుకోవటం స్టార్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఈ తతంగం మొత్తాన్ని తన ఫోన్ లో వీడియోలు తీసుకుని అవి చూసుకుంటూ నేత్రానందం పొందాడు మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్.

Read Also: Aiswarya Rai : ఐశ్వర్య రాయ్ పై నటి కస్తూరి సంచలన ఆరోపణలు.. అలా అనేసిందేంటి?

ఇక, మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ పారిశుధ్య కార్మికురాలిపై చేస్తున్న లైంగిక దాడి వీడియోలు తోటి కార్మికుల చేతుల్లోకి వెళ్లాయి. అవ్వన్నీ చుసిన వారు ఇది ఏంటి సార్ అని ప్రశ్నించటంతో ఎవరికీ చెప్పకండి అంటూ వారికీ ఒక్కొక్కరికి 10 వేల చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చిన కిషన్ వారి నోర్లు ముయించిడాని తెలిపారు. కూకట్ పల్లి మహిళ ఐఏఎస్ జోనల్ కమిషనర్ ఉన్న చోట ఈ దారుణం జరిగింది. ఆమె పరిధిలో పని చేస్తున్న ఓ మహిళా పారిశుధ్య కార్మికురాలిపై ఇంత దారుణం జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విడ్డురంగా ఉందని మహళా కార్మికురాల్లు అంటున్నారు. ఈ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో చూసిన చాలా మంది GHMC ఉన్నతాధికారులు శునక ఆనందం పొందుతున్నారు. కామాందుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం ప్రశ్నర్ధకంగా మారింది.