Bribe : బయటపడ్డ గజ్వేల్ మున్సిపల్ కార్యాలయ అధికారి అవినీతి బాగోతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని చేసినా ‘కుక్కతోక వంకరే’ అనే సామెతకు తగ్గట్టుగా ఉంది గజ్వేల్‌లో మున్సిపల్ కార్యాలయంలోని ఓ అధికారి తీరు. రోజూ అవినీతి చేస్తూ పట్టుబడుతున్నవారిని గురించి వింటూనే ఉన్నాడు.. కానీ.. తాను మాత్రం బుద్ధి మార్చుకోలేకపోయాడు.. గజ్వేల్ మున్సిపల్ కార్యాలయ అధికారి అవినీతి బాగోతం బయటపడింది. మార్వాడీలకు ట్రేడ్ లైసెన్స్ ల జారీ విషయంలో అదనంగా డబ్బులు వసూలు చేశాడు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయ అధికారి. తమ షాపుల లైసెన్స్ రెన్యూవల్ కోసం సంబంధిత అధికారిని ఆశ్రయించారు బాధితులు. అయితే.. నిబంధనల ప్రకారం రూ.46వేల ఫీజు చెల్లించాల్సి ఉండగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడు సదరు అధికారి. లేదంటే లైసెన్స్‌లు పెండింగ్ లో పెడతానని బెదిరింపులు దిగాడు.
Also Read
అయితే… అంత డబ్బు తాము చెల్లించలేమని మార్వాడీ వ్యాపారులు ఎంత విన్నవించుకున్నా మున్సిపల్ అధికారి వినలేదు.. చివరకు రూ.46వేల ఫీజుతో పాటు అదనంగా మరో రూ.10,720 ముట్టజెప్పారు బాధితులు. అయితే.. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని.. లైసెన్స్ లు ఇవ్వకుండా పెండింగ్ పెట్టడంతో బాధితులు మున్సిపల్ చైర్మన్, కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. దీంతో.. విచారణ చేపట్టిన అధికారులు అదనంగా వసూలు చేసింది నిజమేనని నిర్ధారణకు వచ్చి.. అధికారికి షోకాజు నోటీసు జారీ చేశారు. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఆదేశాలు ఇచ్చారు.
- Tags
- big news
- breaking
- bribe
- latest news
తాజావార్తలు
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్‌పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్‌కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్‌లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..