Site icon NTV Telugu

Mumbai vs Uttarakhand: అరెరే.. రోహిత్ గోల్డెన్ డకౌట్.. అయినా గెలిచినా ముంబై..!

Rohit

Rohit

Mumbai vs Uttarakhand: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన గ్రూప్ C మ్యాచ్‌లో ముంబై 51 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయినప్పటికీ.. మిగతా బ్యాటర్లు అద్భుతంగా రాణించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ బ్యాటర్ హార్దిక్ తమోరే 82 బంతుల్లో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు మంచి స్కోర్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

Delhi vs Gujarat: ఉత్కంఠ మ్యాచ్ లో కోహ్లీ జట్టు విజయం..!

అతనికి ముసీర్ ఖాన్ (55), సర్ఫరాజ్ ఖాన్ (55), శంస్ ములానీ (48), శార్దుల్ ఠాకూర్ (29)లు సహకారం అందించడంతో ముంబై భారీ స్కోర్‌ చేయగలిగింది. ఉత్తరాఖండ్ బౌలర్లలలో డెవేంద్ర సింగ్ బోరా 3 వికెట్లతో మెరిసినా ఎక్కువ పరుగులు ఇచ్చాడు. నాగర్కోటి, మయాంక్ మిశ్రా, సుచిత్ చెరో వికెట్ సాధించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఉత్తరాఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులకే పరిమితమైంది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్ లో యువరాజ్ చౌదరి 96 పరుగులతో పోరాటం చేసినా, మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో సహకరించలేకపోయారు.

AUS vs ENG 4th Test: మొదటి రోజే నేలకూలిన 20 వికెట్లు.. ఐదేసిన జోష్ టంగ్..!

ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, ఒంకార్ తర్మాలే, ముసీర్ ఖాన్ కీలక వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో అజేయంగా 93 పరుగులు చేసిన హార్దిక్ తమోరేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

Exit mobile version