NTV Telugu Site icon

Syed Mushtaq Ali Trophy: విదర్భ బౌలర్లను ఊచకోత కోసిన అజింక్య రహానే.. సెమిస్‌లోకి దూసుకెళ్లిన ముంబై

Syed Mushtaq Ali Trophy

Syed Mushtaq Ali Trophy

Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ముంబై, విదర్భ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్‌లో అభిమానులు మరోసారి అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌ను ఆస్వాదించారు. అయితే, స్టార్ ప్లేయర్లతో అలరించిన ముంబై జట్టు ఎట్టకేలకు మ్యాచ్‌లో విజయం సాధించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెమీ ఫైనల్‌కు చేరిన మూడు జట్లను ఖరారు అయ్యాయి. ముంబై కంటే ముందు బరోడా, మధ్యప్రదేశ్ కూడా సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి.

Also Read: Taliban Minister Killed: కాబూల్‌లో భారీ పేలుడు.. తాలిబన్ మంత్రి మృతి

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్‌లో ఇరు జట్లు 200కు పైగా పరుగులు చేశాయి. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. అథర్వ టైడే అత్యధికంగా 66 పరుగులు చేశాడు. అలాగే, అపూర్వ వాంఖడే 33 బంతుల్లో 51 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. చివరిలో శుభమ్ దూబే 19 బంతుల్లో 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ముంబై తరఫున అథర్వ అంకోలేకర్, సూర్యాంశ్ షెడ్గే చెరో 2 వికెట్లు తీశారు.

Also Read: Smriti Mandhana: రికార్డు బ్రేక్.. ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్‌గా స్మృతి

ఇక భారికి లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా, అజింక్యా రహానేలు అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 7 ఓవర్లలో 83 పరుగులు జోడించారు. ఆ తర్వాత పృథ్వీ షా 26 బంతుల్లో 49 పరుగులు, రహానే 45 బంతుల్లో 84 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఆ తర్వాత శివమ్ దూబే 22 బంతుల్లో అజేయంగా 37 పరుగులు, సూర్యాంశ్ షెడ్గే 12 బంతుల్లో అజేయంగా 36 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి మొత్తం 445 పరుగులు వచ్చాయి. ఇక ఇదే సీజన్ లో ముంబై, ఆంధ్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 448 పరుగులు వచ్చాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు గోవా, ముంబై జట్లు కలిసి మొత్తంగా 474 పరుగులు చేసాయి.

Show comments