ప్రయాణిస్తున్న బస్సు ఆగిపోయి మొరాయిస్టే మామూలుగా జనం ఏం పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. అయితే మరి కొందరు మాత్రం డ్రైవర్ కు సహయంగా బస్సును తోస్తుంటారు. అయితే ఎప్పుడూ బిజీగా ఉండే ముంబయి నగరంలో ఇక ఉద్యోగాలకు వెళ్లే టైంలో మరింత హడావిడి కనిపిస్తుంది. అలాంటి టైంలో ఓ ఫ్లై ఓవర్ మీద బస్సు ట్రబుల్ ఇచ్చి నిలిచిపోయింది. పనులకు, ఉద్యోగాలకు వెళ్లే టైంలో బస్సు మొరియిస్తే జనం ఒక్క క్షణం నిలబడకుండా.. అక్కడ నుంచి తిట్టుకుంటూ వేరే బస్సు కోసం పరుగులు తీస్తారు.
https://twitter.com/medohh777/status/1652161168730112000
Also Read : Mars: అంగారకుడిపై నీటి జాడలను గుర్తించిన చైనా రోవర్..
కానీ ఇక్కడ అలా జరగలేదు. బస్సు దిగిన ప్రయాణికులంతా కలిసి బస్సును నెడుతూ డ్రైవర్ కి సాయం అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా విలువైన సమయం.. అయినా కూడా సమయం పక్కనపెట్టి ఒకరికొకరు ఎంత సాయం చేసుకున్నామనేది ముఖ్యం అనే టైటిల్ తో ఈ వీడియోను ఫస్ట్ @medohh777 ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశాడు. ఆ వీడియోను ముంబయి పోలీసులు ముంబయి మూమెంట్స్.. ముంబయి బలం ముంబైకర్లే.. మా పోలీస్ స్నేహితుడు అక్కడివారితో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ వీడియోను షేర్ చేశారు.
Also Read : Ustaad Bhagat Singh: అరే సాంబ.. రాసుకోరా.. ఈసారి త్రిబుల్ ధమాకా కేక
ఈ వీడియోపై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఐక్యమత్యంతో ఉంటే విజయం సాధిస్తామన్నది ఇలాంటి ఘటనలు చూస్తుంటే అర్థమవతుందని కొందరు.. సాయపడేతత్వం ముంబయిలో మాత్రమే ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమస్యలపైనా.. సంబరాలపైనా ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో బాగానే స్పందిస్తూ ఉంటారు. ఇలా జనానికి-పోలీసులకి మధ్య స్నేహపూరిత వాతావరణం ఉంటే క్రైం రేటు మరింత తగ్గే అవకాశం ఉంటుందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
