NTV Telugu Site icon

December 31 Night: డిసెంబర్ 31 రాత్రి యువకుల ర్యాష్ డ్రైవింగ్.. రూ.90 లక్షల వసూళ్లు!

December 31 Night

December 31 Night

దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్‌ అట్టహాసంగా కొనసాగాయి. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రజలు డీజేలు, డ్యాన్స్‌లు, విందులతో సందడి చేశారు. అయితే, ఈ వేడుకల మధ్య కొన్ని అవాంఛిత ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కొందరు యువకులు ద్విచక్ర వాహనాలు, కార్లతో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో డిసెంబర్ 31 రాత్రి.. ర్యాష్ డ్రైవింగ్ చేసే యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. భారీ చలాన్లు జారీ చేశారు. రాత్రికి రాత్రే జరిమానా విధించి రూ.90 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వసూళ్లు కేవలం ర్యాష్ డ్రైవింగ్ కి మాత్రమే.. వేరే రూ. కోట్లలో చలాన్లు విధించినట్లు పోలీసులు తెలిపారు.

READ MORE: Kerala: మైనర్‌పై అత్యాచారం.. ట్యూషన్‌ టీచర్‌కు 111ఏళ్ల జైలు శిక్ష

ఇదిలా ఉండగా.. డిసెంబర్ 31కి రెండ్రోలు ముందే.. ముంబై పోలీసులు చర్యలు చేపట్టారు. రాత్రి బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు.. తమ కస్టమర్‌లకు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే పరిణామాల గురించి ఖచ్చితంగా అవగాహన కల్పించాలని పోలీసులు ఆదేశించారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు ప్రజలకు కిరాయి రైడ్‌లను తిరస్కరించవద్దని సూచించారు. ఇలా తిరస్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు అవసరమైన అన్ని పత్రాలను వారితో పాటు ఉంచుకోవాలని, సరైన యూనిఫామ్ ధరించాలని సూచించారు. అధిక చార్జీలు వసూలు చేసిన చర్యలు తప్పవని ముంబై ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. క

READ MORE: Highest Salary In The World: ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న భారతీయుడు.. రోజుకు 48 కోట్లు!

Show comments