దేశవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్ అట్టహాసంగా కొనసాగాయి. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రజలు డీజేలు, డ్యాన్స్‌లు, విందులతో సందడి చేశారు.
ముంబైలో శనివారం అంతర్జాతీయ పాప్ స్టార్ దువా లిపా, ప్లేబ్యాక్ సింగర్ జోనితా గాంధీ సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.